Breaking News

పాలవలస కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ

Published on Thu, 02/20/2025 - 12:13

మన్యం, సాక్షి: వైఎస్సార్‌సీపీ  అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. పాలవలస కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. జగన్‌ రాక నేపథ్యంలో వైఎస్సార్‌సీశ్రేణులు, అభిమానులు భారీగా అక్కడికి చేరుకున్నారు.

నియోజకవర్గంలో సీనియర్‌ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూశారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్‌ పరామర్శించనున్నారు. అంతకు ముందు రాజశేఖరం మృతిపై సంతాపం వ్యక్తం చేసిన వైఎస్‌ జగన్‌.. ఫోన్‌ ద్వారా ఆ కుటుంబంతో మాట్లాడి సంఘీభావం తెలిపారు. ఇప్పుడు నేరుగా ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు.

పాలకొండ పర్యటనలో భాగంగా వైఎస్‌ జగన్‌ తొలుత విశాఖపట్నం చేరుకున్నారు. ఆ సమయంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఆయనకు స్వాగతం పలికారు. పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌తో కాసేపు జగన్‌ చర్చించారు.

పాలవలస రాజశేఖరం కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ

పాలసవలస కుటుంబం తరతరాలుగా రాజకీయాల్లో ఉంది. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రాజశేఖరం.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. వైఎస్సార్‌తోనూ రాజశేఖరం మంచి అనుబంధం కొనసాగించారు. ఆపై వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ రాజశేఖరం తనయుడే. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈయన కుమార్తె.

Videos

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

సంచలనం రేపుతున్న ప్రశాంత్ భూషణ్ ట్వీట్

ఏం చంపుతావా? విడదల రజినీని నెట్టేసి కిందపడేసిన SI

బంగారానికి ఏమైంది? వరుసగా పడిపోతున్న ధరలు!

జగన్ లాస్ట్ పంచ్... జస్ట్ సింగిల్ డిజిట్!

పోరాడిన ప్రతి అక్కచెల్లమ్మకు హ్యాట్స్ ఆఫ్.. జగన్ ఎమోషనల్

బాబూ... అప్పుడే ఎందుకు భయపడుతున్నావ్..? అతి దగ్గరలోనే!

Photos

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం...నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)

+5

సంజూ, నమన్ మెరుపులు.. ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచిన భారత్ (ఫొటోలు)