Breaking News

పెళ్లిలో జగనన్న పాట.. వద్దన్న పోలీసులపై ప్రజల ఆగ్రహం

Published on Tue, 11/25/2025 - 10:54

అనంతపురం జిల్లా: పెళ్లి ఊరేగింపులో జగనన్న డీజే పాట రావడంతో కూడేరు పోలీసులు ఆగమేఘాలపై అక్కడకు చేరుకుని ఊరేగింపును అడ్డుకున్నారు. వైఎస్‌ జగన్‌ పాటను పెట్టరాదంటూ హుకుం జారీ చేశారు. దీంతో పోలీసులపై స్థానికులు తిరగబడ్డారు. ఈ ఘటన కూడేరు మండలం కలగళ్లలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు...  కలగళ్లలో వడ్డే శ్రీకాంత్, రూప వివాహం ఆదివారం జరిగింది. అదే రోజు రాత్రి ఊరేగింపులో కుటుంబసభ్యులు డీజే ఏర్పాటు చేసి బంధు మిత్రులతో కలసి సరదాగా డ్యాన్స్‌ చూస్తూ సందడి చేయసాగారు. ఈ క్రమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై రూపొందించిన పాట ప్లే కావడంతో పిల్లలు, యువత రెట్టింపు ఉత్సాహంతో ఈలలు వేస్తూ స్టెప్పులు వేశారు.

ఈ విషయంపై గిట్టని వారి ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఆగమేఘాలపై కలగళ్లకు చేరుకుని డీజే పెట్టరాదంటూ రెండు గంటల పాటు అడ్డుకున్నారు. దీంతో వేడుక జరుపుకోవడం కూడా నేరమేనా? అని పెళ్లి వారు వాదనకు దిగారు. అయితే వైఎస్‌ జగన్‌ పాటలు పెట్టరాదని పోలీసులు చెప్పడంతో పోలీసుల తీరుపై పెళ్లి వారితో పాటు పలువురు గ్రామస్తులు మండిపడ్డారు. ఇదే గ్రామంలో టీడీపీ వారు పెళ్లి ఊరేగింపులో డీజే పెట్టి టీడీపీ పాటలు పెట్టి సంబరాలు జరుపుకున్నారని, ఆ రోజు లేని అభ్యంతరం ఈ రోజు ఎందుకు వచ్చిందని నిలదీశారు. ప్రజలు తిరగబడడంతో పోలీసులు మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)