Breaking News

అవన్నీ పట్టా భూములే

Published on Fri, 11/08/2024 - 05:16

సాక్షి, అమరావతి: సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో సిమెంటు పరిశ్రమ ఏర్పాటు కోసం రైతులు గ్రామ సభలో అడిగిన దాని కంటే ఎక్కువ పరిహారం ఇచ్చి భూములు సేకరించామని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. గ్రామ సభలో ఎకరానికి రూ.2.70 లక్షలు ఇస్తే చాలని రైతులు అడిగారని మావాళ్లు చెబితే.. రైతులను సంతోషపెట్టేలా దానికి అదనంగా రూ.30 వేలు కలిపి ఎకరాకు రూ.3 లక్షలు తగ్గకుండా చెల్లించి ఆ భూములు కొనుగోలు చేశామని.. అదీ జగన్‌ అంటే అని స్పష్టం చేశారు.

 డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ విచారణకు ఆదేశించిన మాచవరం తహసిల్దార్‌.. ఆ భూముల వద్దకు వెళ్లి సర్వే చేసి, అందులో ఒక్క సెంటు కూడా ప్రభుత్వ, అటవీ, జల వనరుల భూములు లేవని స్పష్టం చేశారని(తహíసీల్దార్‌ మీడియాతో మాట్లాడిన వీడియోను ప్రదర్శించి చూపుతూ) గుర్తు చేశారు. అయినా పవన్‌ కళ్యాణ్‌ ఆ భూముల వద్దకు వెళ్లి ఏదో జరిగిపోతున్నట్లు ఊగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

పరిశ్రమలు రాకూడదనే రీతిలో..
⇒ సరస్వతి సిమెంట్స్‌ పక్కనే భవ్య సిమెంట్స్‌ ఎకరా రూ.50 వేలు–రూ90 వేల లోపునే భూములు కొనింది. భవ్య సిమెంట్స్‌ తర్వాతే మా ప్రాజెక్టు వచి్చంది. వాళ్లు భూమి కొన్న ఏడాది తర్వాత మేము రూ.3 లక్షలకు తక్కువ కాకుండా భూములు సేకరించాం. ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడు నేను నిజంగానే చెడ్డోడిని అయితే చాలా చోట్ల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను రూపాయి పెట్టాల్సి­న పని లేకుండా తీసుకోవచ్చు.  గతంలో తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి ప్రభుత్వ భూములను వాళ్ల పీఏ పేరుతో రాయించుకున్నారని విమర్శలొచ్చాయి. సరస్వతి సిమెంట్స్‌లో ఒక ఎకరా ప్రభుత్వ భూమి లేదు. అంతా ప్రైవేటు భూమే.  

⇒ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ నవంబర్‌ 5న సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ప్రాంతంలో పర్యటించారు. అంతకు ముందే డెప్యూటీ సీఎంగా ఆయన ఆదేశాలతోనే అక్టోబర్‌ 26న మాచవరం మండల తహసీల్దార్‌ సరస్వతి పవర్‌కు చెందిన భూములన్నీ పరిశీలించి నివేదిక ఇచ్చారు. సరస్వతి సిమెంట్స్‌ కొనుగోలు చేసిన భూములన్నీ పట్టా భూములేనని ఆమె ప్రకటించారు. ఆ ఫ్యాక్టరీ కోసం సేకరించిన వెయ్యికిపైగా ఎకరాలు మొత్తం పట్టా భూమేనంటూ ధ్రువీకరించారు. నాలుగు ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉన్నా, దాన్ని పరిశ్రమకు తీసుకోలేదని తహసీల్దార్‌ చెప్పారు.  

⇒ సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ పేరుతో పల్నాడు­లో సిమెంట్‌ ఫ్యాక్టరీని అడ్డుకోవాలని చంద్రబా­­­బు కుట్ర పూరితంగా వ్యవహరించారు. కాంగ్రెస్‌ నే­తలతో కలిసి కేసులు వేశారు. దాని వల్లే ఈ­డీ అ­టాచ్‌మెంట్‌లోకి వెళ్లింది. 2014లో  మైనింగ్‌ లీ­జు­లు రద్దు చేశారు. దీనిపై మేము కోర్టును ఆశ్రయి­స్తే 2015లో మాకు అనుకూలంగా స్టే ఇచి్చంది.  

⇒ 2019లో చంద్రబాబు చేసింది తప్పని, లీజులన్నీ రీస్టోర్‌ చేయాలని ఆదేశిస్తూ కోర్టు మాకు అనుకూలంగా తీర్పు ఇచి్చంది.  చంద్రబాబు పరిశ్రమలు రాకూడదనే రీతిలో అడుగులు వేస్తున్నా­రు.  
ఫ్యాక్టరీకి నీళ్లు కూడా ఇవ్వరా? 

⇒ పవన్‌ కళ్యాణ్‌ సిమెంటు పరిశ్రమకు ఇచ్చే నీళ్లపైనా రాద్ధాంతం మొదలెట్టారు.   వాస్తవంగా స్టీల్‌ ఫ్యాక్టరీలకు ఎక్కువగా నీళ్లు కావాలి. సిమెంట్‌ ఫ్యాక్టరీకి పెద్దగా అవసరం ఉండదు. కానీ, అందులో పని చేసేవాళ్ల కోసం కనీసం నీళ్లు ఇవ్వాలి. ఆ మేరకు  బాధ్యత ప్రభుత్వానిదే.

⇒ కడపలో జిందాల్‌ స్టీల్‌ ఫ్యాక్టరీ పెట్టడానికి జిందాల్‌ ముందుకొచ్చి పునాది రాయి వేశారు. ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. ఆయన్ని ప్రోత్సహించాల్సింది పోయి జత్వానిని తీసుకొచ్చి ఆమెతో దొంగ కేసులు పెట్టించి, బెదిరించి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సరస్వతి సిమెంట్స్‌ను ఇదే రీతిలో అడ్డుకునే కుట్రలు చేశారు.  

రాని పరిశ్రమ వచ్చినట్టుగా గొప్పలు  
⇒ మరోవైపున ఆర్సిలర్‌ మిట్టల్‌–నిపాన్‌ పరిశ్రమ అనకాపల్లికి వస్తోందంటూ తప్పుడు వార్తను ప్రచారం చేస్తున్నారు. ఆర్సిలర్‌ మిట్టల్‌–నిపాన్‌ పరిశ్రమ మా దగ్గరే ఉందని, పనులు ప్రారంభించింది అని ఒడిశా మంత్రి   చెబుతున్నాడు. అక్కడ రూ.1.04 లక్షల కోట్లతో 24 మిలియన్‌ టన్నుల గ్రీన్‌ పీల్డ్‌ ప్లాంట్‌ కడుతున్నారు.  మొదలైన ప్లాంట్‌ అపేసి ఇక్కడి వస్తారా?

‘అవి పట్టా భూములే’
‘పవన్‌ కళ్యాణ్‌ ఆదేశాల మేరకు సరస్వతి ప్రాజెక్టు భూములను పరిశీలించాం.   మాచవరం మండలం చెన్నాయ్‌ పాలెంలో 272.96 ఎకరాలు, పిన్నె­ల్లిలో 793.79, వేమవరంలో 710.63 ఎకరాలు.. మొత్తంగా 1073.38 ఎకరాలు పట్టా భూములే. చెరువులు, వాగులు, కుంటలు, వాడీ బాడీస్‌ లేవు. తర్వాత ప్రభుత్వ ల్యాండ్స్‌ పిన్నెల్లిలో 2.87 (కొండ ప్రాంతం), వేమవరంలో 1.44 (చుక్క భూములు) కలిపి మొత్తం 4.31 ఎకరాలుసరస్వతి సిమెంట్స్‌ ఇంకా తీసుకోలేదు. మొత్తం 1077 ఎకరాల భూమికి సంబంధించి గతంలో ఆన్‌లైన్‌ పోరి్టంగ్‌కు పంపించాం. ఇందులో 821.44 ఎకరాలకు పోరి్టంగ్‌ చేశాం. ఇంకా 255.94 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. ఈ నివేదికను పై అధికారులకు పంపిస్తున్నాం’.    – మాచవరం తహసీల్దార్‌ మాట్లాడిన వీడియోలోని మాటలు 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)