నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
గుర్రం జాషువాకు వైఎస్ జగన్ నివాళులు
Published on Fri, 07/24/2026 - 10:51
సాక్షి, తాడేపల్లి: నేడు మహాకవి గుర్రం జాషువా వర్ధంతి. ఈ సందర్బంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్.. జాషువాకు నివాళులు అర్పించారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా..‘అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు’ అని పోస్టు చేశారు.
అణగారిన వర్గాల ఆవేదనను అక్షరాల్లో ఆవిష్కరించి, సమానత్వం, ఆత్మగౌరవం, మానవీయ విలువల కోసం తన చివరి శ్వాస వరకు అక్షర పోరాటం సాగించిన మహాకవి గుర్రం జాషువా గారు. కాలం మారినా ఆయన ఆలోచనలు, ఆయన సాహిత్యం సమాజానికి చైతన్యాన్ని, సమానత్వానికి స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయి. గుర్రం జాషువా గారి… pic.twitter.com/8NscuMpkwo
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 24, 2026
Tags : 1