Breaking News

11న పొదిలికి వైఎస్‌ జగన్‌

Published on Sun, 06/08/2025 - 05:19

పొదిలి రూరల్‌: పొగాకు రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 11న ప్రకాశం జిల్లా పొదిలికి రానున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. శనివారం పొదిలి–దర్శి రోడ్డులోని ఎస్‌ఆర్‌ పెట్రోల్‌ బంకు ఎదురుగా ఉన్న హెలిప్యాడ్‌ స్థలాన్ని వైఎస్సార్‌సీపీ ప్రోగ్రామ్స్‌ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, అన్నా కృష్ణచైతన్యతో కలిసి పరిశీలించారు.

అనంతరం శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గత నెల 28న పొదిలి పొగాకు బోర్డును వైఎస్‌ జగన్‌ సందర్శించాల్సి ఉండగా, వాతావరణ పరిస్థితుల వల్ల వాయిదా పడిందని పేర్కొన్నారు. ఈ నెల 11న కార్యక్రమం ఖరారైనట్లు చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు పొదిలి పొగాకు బోర్డుకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారన్నారు. వైఎస్‌ జగన్‌ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని భరోసా కల్పిస్తారని వివరించారు.

అనంతరం మీడియా సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు. హెలిప్యాడ్‌ ప్రాంతంలో చేపట్టాల్సిన పనులు వేగవంతం చేయాలని బూచేపల్లి సిబ్బందికి సూచించారు. వారి వెంట వైఎస్సార్‌సీపీ నాయకులు సానికొమ్ము శ్రీనివాసరెడ్డి, కేవీ రమణారెడ్డి, గొలమారి చెన్నారెడ్డి, వైఎం ప్రసాద్‌రెడ్డి, వై.వెంకటేశ్వరరావు, కె.నరసింహారావు తదితరులు ఉన్నారు. 

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?