Breaking News

23న ఒంగోలుకు సీఎం జగన్‌ 

Published on Tue, 02/20/2024 - 03:11

ఒంగోలు అర్బన్‌: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 23వ తేదీన ఒంగోలు రానున్నారు. నగరంలోని 22వేల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నగర శివారు అగ్రహారం వద్ద నిర్వహించనున్న సభ ఏర్పాట్లను సోమవారం మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, కలెక్టర్‌ దినేష్కుమార్‌ పరిశీలించారు.

ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి తీరుతామని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లోని జగనన్న టౌన్‌షిప్‌లలో అర్హులైన 22వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని వివరించారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ కూడా వేగంగా జరుగుతోందని చెప్పారు.

జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఆలోచనల మేరకు నగర పరిధిలో అర్హులైన 22 వేల మంది పేదలకు సీఎం చేతుల మీదుగా చేపడుతున్న పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో జగనన్న టౌన్‌షిప్‌లను అర్బన్‌ డెవలప్‌మెంట్‌ టౌన్‌గా ఏర్పాటు చేయడంతోపాటు అన్ని మౌలిక సదుపాయాలు కల్పింస్తామన్నారు. కలెక్టర్‌ దినేష్కుమార్‌ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు మల్లేశ్వరపురం, అగ్రహారం, వెంగముక్కలపాలెం గ్రామాల్లో 536 ఎకరాలు భూసేకరణ చేశామన్నారు. పట్టాల పంపిణీ పూర్తి పారదర్శకంగా చేపట్టడంతోపాటు నగరంలోని 70 సచివాలయాల పరిధిలో కన్వేయడ్‌ డీడ్‌ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిపారు. ఆర్డీవో విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)