Breaking News

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ

Published on Fri, 02/07/2025 - 05:36

సాక్షి, అమరావతి: ‘‘ఎన్నికలకు ముందు చంద్రబాబు నోట ‘బాబు ష్యూరిటీ.. భవిష్యత్‌కు గ్యారంటీ’ అనే మాట వినిపించేది. ఇప్పుడు ఎక్కడకు వెళ్లినా ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ’ అనే మాట వినిపిస్తోంది. బటన్‌ నొక్కడం ఏమైనా పెద్ద పనా? మూలనున్న ముసలావిడ కూడా బటన్‌ నొక్కుతుందంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. సూపర్‌ సిక్స్, సూపర్‌ సెవన్‌ అంటూ మేనిఫెస్టోలో 143 హామీలిచ్చారు. చంద్ర­బాబు, ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలు ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి టీడీపీ హామీలకు గ్యారెంటీ అంటూ బాండ్లు పంచారు. 

హామీలు అమలు చేయలేక­పోతే చొక్కా పట్టుకుని నిలదీ­యమన్నారు. మరి ఆ బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టో ఏమైంది? పంచిన కరపత్రాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరి చొక్కా పట్టుకోవాలి’ అని వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

సూపర్‌ సిక్స్‌తోపాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యా­యని చంద్రబాబును ప్రజలు నిలదీసే పరిస్థితులు త్వరలోనే రానున్నాయ­న్నారు. జమిలి రూపంలో ఎన్నికలు ఎంత తొందరగా వస్తే ఆయన్ను అంత త్వరగా పంపించేయాలని ప్రజలు ఎదురు చూస్తున్నా­రన్నారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

మరి ఎవరి చొక్కా పట్టుకోవాలి?
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు  కావస్తోంది. ఎన్నికల ముందు ఇంటింటికీ తిరిగి హామీలిచ్చారు. ఏ ఇంట్లో అయినా చిన్న పిల్లలు కనిపిస్తే తల్లికి వందనం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అని చెప్పారు. తల్లులు కనిపిస్తే ఆడబిడ్డ నిధి కింద నీకు రూ.18 వేలు. రూ.18 వేలు.. అని నమ్మబలికారు. ఆ పిల్లల అమ్మమ్మలు, అత్తమ్మలు కనిపిస్తే మీకు 50 ఏళ్లు నిండాయి కదా పెన్షన్‌ కింద నీకు రూ.48 వేలు నీకు రూ.48 వేలు.. అని చెప్పారు. 

యువత కనిపిస్తే నిరుద్యోగ భృతి కింద నీకు రూ.36 వేలు.. రైతన్న కనిపిస్తే అన్నదాతా సుఖీభవ కింద నీకు రూ.20 వేలు ఇస్తామని ఇంటింటికి బాండ్లు కూడా పంచారు. వీళ్లు ఇచ్చిన హామీలకు  ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 బాకా ఊదాయి. ఇప్పుడు వారు ఇచ్చిన బాండ్లు ఏమయ్యాయి? మేనిఫెస్టోలో హామీలు ఏమయ్యాయి? ప్రచార కరపత్రాలు ఏమయ్యాయి? ఎవరి చొక్కా పట్టుకోవాలి? ఎవరిని నిలదీయాలి?

ఐఆర్‌ ఏమైంది? పీఆర్సీ ఏది?
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్‌ అన్నారు. ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. మెరుగైన పీఆర్సీ అన్నారు. పీఆర్సీ చైర్మన్‌ను బలవంతంగా రాజీనామా చేయించారు. 1వ తేదీనే జీతాలంటూ తొమ్మిది నెలల్లో ఒకే ఒక్కసారి ఇచ్చారు. మూడు డీఏలు, ట్రావెల్‌ ఎలవెన్స్, సరెండర్‌ లీవ్స్, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ అన్నీ పెండింగ్‌.. పెండింగ్‌! జీఎల్‌ఐ, జీపీఎఫ్‌లను చంద్రబాబు వాడేసుకుంటున్నారు. ఆర్థిక విధ్వంసం అంటే ఇదీ.

కొత్తవి దేవుడెరుగు.. ఉద్యోగాలు ఊడగొట్టారు
తొమ్మిది నెలల్లో కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్నవే ఊడగొట్టారు. ఎన్నికల ముందు వలంటీర్లకు నెలకు రూ.10 వేలు వేతనం ఇస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాక 2.60 లక్షల వలంటీర్‌ ఉద్యోగాలను తీసేశారు. బెవరేజ్‌ కార్పొరేషన్‌లో 18 వేల మందిని తొలగించారు. 

ఫైబర్‌ నెట్, ఏపీఎండీసీ, ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్, వైద్య ఆరోగ్య శాఖ.. ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలను తొలగించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల్లో సర్దుబాటు చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. తద్వారా ఆయా విభాగాల్లో ఖాళీలను పూర్తిగా కుదిస్తున్నారు. 



చీటింగ్‌లో బాబు పీహెచ్‌డీ..
ఎవరైనా ఎన్నికల హామీలు ఏమయ్యాయని చంద్రబాబును ప్రశ్నిస్తే.. వెటకారంగా మాట్లాడటాన్ని చూస్తున్నాం. మొన్న రాయచోటిలో ఇలాగే ప్రశ్నిస్తే.. సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవిలో చెప్పు అని వ్యాఖ్యానించటాన్ని చూశాం. అన్నీ తెలిసి కూడా ఆయన అడ్డగోలు హామీలిచ్చారు. 

చీటింగ్‌లో పీహెచ్‌డీ తీసుకున్న వ్యక్తి ఒక్క చంద్రబాబు మాత్రమే. ఇక ఆయన నటన ఏ స్థాయిలో ఉంటుందంటే.. హామీలను ఎగ్గొట్టేసి చాలా బాధగా, ఆవేదనగా ఉంది. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. భయమేస్తోందని.. రాష్ట్రం ధ్వంసమై పోయిందని అంటారు! సినిమాల్లో దివంగత ఎన్టీఆర్‌ను మించిన హావ భావాలను ప్రదర్శిస్తారు. ఆ నటనకు కచ్చితంగా అవార్డు ఇవ్వాల్సిందే!!

స్లో పాయిజన్‌..
చంద్రబాబును నమ్మడమంటే చంద్రముఖిని నిద్ర లేపడమే.. పులి నోట్లో తలపెట్టడమేనని నేను ముందే హెచ్చరించా. చంద్రబాబు మాయ మాటలతో మోసపోయిన ప్రజలు ఇప్పుడు బాధపడే పరిస్థితి కనిపిస్తోంది. చంద్రబాబు ప్రజలను వంచించడం, మోసం చేయ­టాన్ని ఓ పద్ధతి ప్రకారం స్లో పాయిజన్‌ రూపంలో ఎక్కిస్తారు. 

తన అబద్ధాల ఫ్యాక్టరీ నుంచి ఒక్కొక్కటి బయటకు తీస్తారు. వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 రకరకాల పద్ధతుల్లో పబ్లిసిటీ ఇస్తాయి. చంద్రబాబు తప్పేమీ లేన­ట్లుగా.. రాష్ట్రం ఇలాంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి ఆయన చేయలేకపోతున్నాడన్న భావన ప్రజల్లో కల్పిస్తారు. 

పిల్లలకు మనం ఏం చెబుతాం..? 
అబద్ధాలు ఆడకూడదు.. మోసాలు చేయకూడదు.. ఎదుటివారికి మంచి చేయాలి.. మాట తప్పకూడదు.. విలువలు ఉండాలి. విశ్వసనీయత పెంచుకోవాలి... అలాగే బతకాలని మనం పిల్లలకు చెబుతాం. ఒక్క చంద్రబాబు మాత్రమే తన కుమారుడి దగ్గర నుంచి తన పార్టీలో ఉన్నవారికి చెప్పే సిద్ధాంతం ఏమిటంటే.. అబద్ధాలు చెప్పు.. మోసం చెయ్‌.. మన స్వార్ధం కోసం ఏం చేసినా తప్పు లేదు.. మోసం చేసినా తప్పు లేదు.. అదీ ఓ ఘనకార్యమే అని చెబుతూ నేర్పించే నాయకుడు చంద్రబాబు మినహా మరొకరు లేరు. 

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)