Breaking News

వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడేది?

Published on Wed, 06/11/2025 - 05:44

సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వ ఏడాది పాలనలో రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యా­లను ఎత్తిచూపుతూ.. మహిళలపై గతంలో చంద్ర­బాబు, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు, లోకేశ్‌ వ్యవహరించిన తీరుకు సంబంధించిన వీడి­యోలను జత చేస్తూ.. వీళ్లా మహిళల గౌర­వాన్ని కాపాడేదంటూ వైఎస్సార్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎం చంద్ర­బాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మహిళల గౌరవం కాపాడటం’ అనే ముసు­గులో కూటమి నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి మీడియా కార్యాలయాలపై చేస్తున్న దాడు­లను, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టును ఖండిస్తూ ‘ఎక్స్‌’లో మంగళవారం ఆయన పోస్టు చేశారు. అందులో ఏం చెప్పారంటే.. 

అది  రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు
‘పారదర్శకత, అవినీతి రహిత, న్యాయబద్ధ­మైన, విప్లవాత్మక సంక్షేమ పథకాలతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థవంతంగా పాలన చేసింది. కానీ.. చంద్రబాబు ప్రభుత్వ ఏడాది పాలన మోసాలతోనే కొనసాగింది. రెడ్‌ బుక్‌తో వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ నిరంకుశ పాలన సాగుతోంది. తన గొప్ప వాగ్దానాలను అమలు చేయలేని అసమర్థతతో ప్రజలను మోస­గించిన చంద్రబాబు.. తన వైఫల్యాలను కప్పిపు­చ్చుకునేందుకు.. ప్రజల దృష్టి మళ్లించేందుకు అలజడి సృష్టిస్తున్నారు. సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మి­నేని శ్రీనివాసరావు ఎప్పుడూ చేయని వ్యాఖ్య­లను తప్పుగా చిత్రీకరించి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయించారు. ఇది చట్టబద్ధంగా జరిగిన అరెస్టు కాదు. రాజకీయ దురుద్దేశంతో జరిగిన అరెస్టు. ఆయన చర్చను నిష్పక్షపాతంగా నిర్వహి­స్తారు.

ఆయన చేయని వ్యాఖ్యలను చంద్రబాబు ప్రభుత్వం వక్రీకరించి కొమ్మినేనిని బాధ్యులుగా చేయడం ఎంత అన్యాయం? వాస్తవాలను వక్రీక­రించి ఒక పథకం ప్రకారం మహిళల గౌరవాన్ని కాపాడటం అనే ముసు­గులో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. కోడలు మగ బిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు, అమ్మాయి కన్పిస్తే వెళ్లి ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలి.. అంటూ బాల­కృష్ణ అన్న మాటలు.. అమ్మాయిలతో లోకేశ్‌ నృత్యం చేస్తున్న వీడియోలు.. వీళ్లా మహిళల గౌరవాన్ని కాపాడతామని చెప్పేది? ఈ వీడి­యోలు వారి నిజ స్వరూపాన్ని బట్టబ­యలు చేస్తు­న్నాయి. మహిళల పట్ల వారికి ఉన్న గౌరవాన్ని, విలువను చాటిచెబుతు­న్నాయి. 

హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? 
రాష్ట్రంలో ఏడాదిలోనే 188 అత్యాచారాలు, 15 అత్యాచార హత్యలు జరగడం కూటమి ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన ఇంటర్మీడియట్‌ గిరిజన విద్యార్థినిని హత్య చేసి, ఆమె మృత­దేహాన్ని అడవిలో పడేశారు. ఏడుగుర్రాల­పల్లిలో 9వ తరగతి చదువుతున్న దళిత బాలికను టీడీపీకి చెందిన 14 మంది ఆరు నెలల పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఆమె గర్భవతి అయింది. తీవ్రమైన రాజకీయ ఒత్తిడి, పోలీసుల నిష్క్రియాపరత్వాల మధ్య ఆ బాధితురాలి కుటుంబం అదృశ్యమైంది. మహి­ళలకు వారు హామీ ఇచ్చిన భద్రత ఇదేనా? వారు కాపాడిన గౌరవం ఇదేనా? మహిళల పట్ల వారి చర్యలు, వైఖరి రెండూ అవమానకరంగా ఉన్నాయి. మహిళల గౌరవం కాపాడటం ముసు­గులో కూటమి నేతలు పగ పెంచుకున్న వారిపై కేసులు నమోదు చేయడం అసహ్యకరం.  

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)