Breaking News

సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published on Wed, 07/22/2026 - 22:46

సాక్షి,అమరావతి: మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్టుపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుప్రమాదాన్ని కక్ష‍సాధింపు కోసం వాడుకోవడంపై ఫైరయ్యారు.  చంద్రబాబు ప్రభుత్వం నీచంగా దిగజారిపోయిందని సీదిరి అప్పలరాజు చేసిన తప్పేంటని చంద్రబాబు అరాచకాలను ప్రశ్నించడమా? పలాస ప్రజల తరపున నిలబడడమా? డాక్టర్‌గా మంచి పేరు సంపాదించి సేవ చేయడమా? చంద్రబాబు తన రాజకీయ అజెండాను ఎల్లో మీడియాతో రాయించడం... ఆ తర్వాత పోలీసులు దాన్ని కేసుగా మార్చడం రాష్ట్రంలో అమలవుతున్న కొత్త చట్టవ్యవస్థ ఇదే? అని ఎక్స్ వేదికగా వైఎస్‌ జగన్  ఆగ్రహం వ్యక్తం చేశారు. 

వైఎస్‌జగన్ మాట్లాడుతూ...  సీదిరి అప్పలరాజు కుమారుడు కేవలం 18 ఏళ్ల కుర్రాడని బైక్‌ నడుపుతూ ప్రమాదానికి కారకుడయ్యాడన్న ఆరోపణలపై యాక్సిడెంట్‌కు సంబంధించిన చట్టాలు కాకుండా ఏకంగా హత్యానేరం అభియోగాలు మోపి అరెస్టు చేశారు. ఆ పిల్లాడిని రిమాండ్‌కు పంపడం.. ఇప్పుడు ఏకంగా తన తండ్రిని కూడా అరెస్టు చేయడం. ఇవన్నీ చూస్తే ఆయనను రాజకీయంగా వేదించడమే చంద్రబాబు టార్గెట్‌గా మారింది. అని వైఎస్‌ జగన్‌ కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీదిరి అప్పలరాజు సామాన్య మత్స్యకార కుటుంబం నుంచి తన సొంత ప్రతిభతో ఎదిగిన వ్యక్తి. చదువుల్లో రాణించి వైద్యుడిగా ఎదిగి, ఎంతోమందికి వైద్యసేవలు అందించి ప్రాణాలు కాపాడారన్నారు.  వైఎస్సాఆర్‌సీపీ  తరఫున ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిగా ప్రజలకు సేవలందించారు. అలాంటి వ్యక్తిని తప్పుడు అభియోగాలతో నేరస్తుడిగా చిత్రీకరించాలని చూడటం అత్యంత దుర్మార్గమన్నారు. 

ఒక 18 ఏళ్ల పిల్లాడు, బైక్‌ నడుపుతూ పొరపాటున  గొర్రెలకాపరిని ప్రమాదవశాత్తూ యాక్సిడెంట్‌ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో, దురదృష్టవశాత్తూ ఆ వ్యక్తి మరణానికి గురైతే అది హత్య ఎలా అవుతుంది? ఒక 18 ఏళ్ల పిల్లాడు పొరపాటున చేసిన యాక్సిడెంట్‌కు, తన తండ్రికి ఎలా సంబంధం ముడిపెడతారు?, ఇది అన్యాయం కాదా?  అని ప్రశ్నించారు

కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులతో వైఎస్సార్సీపీ నేతలను భయపెట్టలేదని . ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుందన్నారు. చంద్రబాబూ.. అధికారం శాశ్వతం కాదు. ఇవాళ మీరు పెడుతున్న ప్రతి తప్పుడు కేసు, చేయిస్తున్న ప్రతి అక్రమ అరెస్టు, అధికార దుర్వినియోగం.. వీటన్నింటినీ ప్రజలు సహించబోరు, మీకు తప్పక గుణపాఠం చెప్తారు. అని కూటమి ప్రభుత్వానికి వైఎస్‌ జగన్ హెచ్చరికలు జారీ చేశారు.

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?