Breaking News

మత్స్యకారులసంక్షేమానికి పెద్దపీట వేశాం

Published on Fri, 11/22/2024 - 05:22

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేశామని.. వారి స్థితిగతులను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఈ మేరకు గురువారం ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ‘మత్స్యకారుల సంక్షేమం కోసం మన ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. సముద్రంపై వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.3,767.48 కోట్లతో 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 

వేట నిషేధ సమయంలో దాదాపు 1,23,519 మత్స్యకార కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేశాం. సబ్సిడీపై డీజిల్‌ అందించాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని గంగపుత్రులందరికీ మత్స్యకార దినోత్సవ శుభాకాంక్షలు’ అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.  

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)