రోడ్డు ప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

Published on Fri, 05/02/2025 - 21:55

తాడేపల్లి : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందడంపై వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీశైలంలో దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు వైఎస్ జగన్  ఇటువంటి దుర్ఘటనలు జరగటం అత్యంత బాధాకరమని, ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు వైఎస్ జగన్.

కాగా, నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు మండలంలోని సిద్ధాపురం చెరువు వద్ద శుక్రవారంఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు, గుంటూరు ప్రధాన జాతీయ రహదారిపై బోలెరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో  నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 16 మందికి గాయాలు కాగా, అందులో పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.

గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  శ్రీశైల క్షేత్రంలో దైవదర్శనానికి వెళ్లి బొలెరో వాహనంలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారు, మృతులు కర్నూలు జిల్లా ఆదోని పట్టణం ఇందిరానగర్, రాజీవ్ నగర్ లకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)