Breaking News

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి

Published on Fri, 05/23/2025 - 17:23

సాక్షి, తాడేపల్లి: ప్రకాశం జిల్లారోడ్డు ప్రమాదంపై వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కారు-లారీ ఢొకొని ఆరుగురు మృతి చెందడంపై సంతాపం తెలిపారు.

దైవ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లే సమయంలో.. దుర్ఘటన చేసుకోవడం అత్యంత బాధాకరం..ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలి. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి’ అని కోరారు. 

ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాలలో ఒకటైన మహానందినిని దర్శనం చేసుకుని కారులో ఇంటికి వెళ్తున్న ఓ కుటుంబాన్ని మృత్యువు కబళించింది. బాధితుల కుటుంబాల్లో తీరని వేదన మిగిల్చింది

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శైవక్షేత్ర దర్శనం అనంతరం మహానంది నుంచి చీరాల వెళ్తున్న ప్రయాణికుల కారు కోమరోలు మండలం తాటిచెర్లమోటు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది.

రాంగ్‌రూట్‌లో వచ్చిన లారీని బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కార్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందగా..మరో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతులు బాపట్ల జిల్లా స్టువర్టుపురానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.  

ప్రమాదంతో అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రుల్ని రక్షించే ప్రయత్నించారు. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే, ప్రమాద తీవ్రత కారణంగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు ఘటన స్థలంలో మృతి చెందినట్లు తెలుస్తోంది. 

మృతుల వివరాలు
గజ్జల నరసింహ (33), బచ్చు సందీప్ అలియాస్ సన్నీ(30),గజ్జల బబ్లు(29), కర్రెద్దుల దివాకర్ అలియాస్ చిన్ని,గజ్జల భవాని (20)గజ్జల అంకాలుగా పోలీసులు గుర్తించారు.

ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ విచారం

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)