Breaking News

‘చంద్రబాబూ..! రైతుల ఉసురుపోసుకోవద్దు’: వైఎస్‌ జగన్‌

Published on Tue, 10/29/2024 - 10:46

సాక్షి,తాడేపల్లి: పంటల బీమా ప్రీమియం రైతులే చెల్లించాలంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారమా చంద్రబాబు అంటూ ఎక్స్‌ వేదికగా ప్రశ్నలు సంధించారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రైతులపై పాసా భారం పడకుండా ఐదేళ్లపాటు ఉచిత పంటల బీమీ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిన  విషయాన్ని వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. నోటిఫై చేసిన ప్రతీ పంటకు సాగైన ప్రతీ ఎకరాకు యూనివర్శల​ కవరేజ్‌ కల్పిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. 

రైతుల పంట బీమా కూడా మీకు భారమా బాబూ

 

 

రైతుల్లో ఆందోళన..

టీడీపీ ప్రభుత్వానికి రైతులంటే చిన్నచూపే అనే విషయం మరోసారి రుజువైంది. వ్యవసాయమంటే దండగ అని గతంలో చంద్రబాబు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలను చూశాం. ఇప్పుడు ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు. దీంతో రైతులు, రైతు సంఘాల నేతలు సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రైతులపై పైసా భారం పడకుండా ఐదేళ్లపాటు విజయవంతంగా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమాను అమలు చేసింది.

ఆ పథకాన్ని ఎత్తేసి రైతులే పంటల బీమాను చెల్లించుకోవాలని ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రైతులు నిరక్షరాస్యులే ఉంటారు. వాళ్లు పంటలబీమాను ప్రకటించినప్పుడు తెలుసుకుని వెళ్లి డబ్బులు చెల్లించడం అనేది చాలా కష్టతరమైన పని. ఇలాంటి నేపథ్యంలో పంటల బీమాను రైతులే చెల్లించాలనటం ఎంత వరకు సబబని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)