Breaking News

రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు

Published on Wed, 12/24/2025 - 21:05

సాక్షి, తాడేపల్లి: క్రిస్మస్‌ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పులివెందుల పర్యటనలో ఉన్న ఆయన ఈ మేరకు ఓ సందేశం విడుదల చేయడంతో పాటు ఎక్స్‌ వేదికగా ఓ పోస్ట్‌ చేశారు. 

‘‘దైవ కుమారుడు జీసస్‌ మానవునిగా జన్మించిన రోజును ప్రపంచ వ్యాప్తంగా క్రిస్మస్‌ పండుగగా జరుపుకుంటారు. కరుణ, ప్రేమ, క్షమ, సహనం, దాతృత్వం, త్యాగం.. ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు.. తద్వారా, మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు..

..దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్‌ బాటలు వేశారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిపిస్తాయి అని వైఎస్‌ వైఎస్ జగన్ క్రిస్మస్‌ శుభాకాంక్షల్లో తెలియజేశారు.

ఈ ఉదయం ఎక్స్‌ ఖాతాలో.. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు!. ఈ పండుగ రోజు మనం కొత్త ఆశతో, మంచి భవిష్యత్తు కోసం కలిసి ముందుకు సాగుదాం. సాటి మనుషులకు సహాయం చేస్తూ, ఆనందం పంచుకుందాం. మెర్రీ క్రిస్మస్! అంటూ వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

 ‘ఈరోజు ఎంతో సంతోషంగా క్రిస్మస్‌ పండుగ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు. ఒక నూతన విశ్వాసం ఆవిర్భవించిన ఈవేళ, మానవత్వాన్ని మరింత పరిమళింపచేసేలా, మన అంకితభావాన్ని పునరుద్ధరిస్తూ.. తద్వారా ప్రజలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేలా ముందుకు సాగుదాం’. మరోసారి మీ అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు అని తెలియజేశారాయన.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)