Breaking News

రాప్తాడులో జన‘హోరు’

Published on Mon, 11/24/2025 - 05:29

రాప్తాడు/రాప్తాడు రూరల్‌: ఉప్పొంగిన అభిమాన జన సంద్రంతో రాప్తాడు ప్రాంతం కిక్కిరిసిపోయింది. జై జగన్‌ నినాదాలతో హోరెత్తిపోయింది. అభిమాన నేతను చూసేందుకు.. చేయి కలిపేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున పోటీపడ్డారు. వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె డాక్టర్‌ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్‌ తేజేష్‌రెడ్డి వివాహ వేడుక ఆది­వారం అనంతపురం జిల్లా రాప్తాడు సమీపంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు వైఎస్‌ జగన్‌ వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.


                 వివాహ వేడుకలో పాల్గొని, నవ దంపతులను ఆశీర్వదిస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

హెలిప్యాడ్‌ నుంచి వైఎస్‌ జగన్‌ కారులో ప్రయాణిస్తున్న మార్గంలో అశేష జనసందోహంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. ఆయన కాన్వాయ్‌ వెంట అభిమానులు ఉప్పొంగిన ఉత్సాహంతో అడుగులు వేశారు. వి­వా­హ వేదిక వద్దకు చేరుకోగానే ఈలలు, జై జగన్‌ నినాదాలు చేస్తూ తమ అభిమానం చాటుకున్నా­రు. వైఎస్‌ జగన్‌ అందరికీ అభివాదం చేస్తూ.. చి­రునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ వేదిక వద్ద­కు చేరుకున్నారు. నూతన వధూవరులు డాక్టర్‌ మోక్షితా విష్ణుప్రియారెడ్డి, డాక్టర్‌ తేజేష్‌రెడ్డికి వైఎస్‌ జగన్‌ వివాహ శుభాకాంక్షలు తెలియజేసి.. ఆశీస్సులు అందజేశారు. తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వారి కుటుంబ సభ్యులు, బంధువులతో వైఎస్‌ జగన్‌ ముచ్చటించారు. అనంతరం అక్కడి నుంచి తిరుగుపయనమయ్యారు. 

 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)