నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..
Breaking News
విశాఖ స్టీల్ ప్లాంట్ ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
Published on Mon, 06/08/2026 - 18:30
విశాఖపట్నం: విశాఖ స్టీల్ప్లాంట్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదం అత్యంత విషాదకరమన్న వైఎస్ జగన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.
ఈ దుర్ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాలన్నారు. ఈ దారుణమైన ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలను తీసుకోవాలన్నారు. భవిష్యత్లో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు. బాధితులకు విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ నేతలు అండగా ఉండాలని వైఎస్ జగన్ సూచించారు. క్లిష్ట సమయంలో బాధితులకు అండగా ఉండాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
కాగా, ఈ దుర్ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సోమవారం సాయంత్ర సమయంలో ఈ ఘెర ప్రమాదం సంభవించింది. ప్రధానంగా ప్లాంట్ ఎస్ఎంఎస్ -2లో హాట్మెంట్ బకెట్లు కూలి ఈ దుర్ఘటన జరిగింది. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరికొందరు కార్మికులు లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం..
విశాఖ స్టీల్ ప్లాంటులో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
Tags : 1