Breaking News

అభిషేక్ రెడ్డికి వైఎస్‌ జగన్‌ దంపతుల నివాళి

Published on Sat, 01/11/2025 - 10:07

వైఎస్సార్‌, సాక్షి: వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ వైఎస్‌ అభిషేక్‌ రెడ్డి పార్థీవదేహానికి పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. సతీమణి వైఎస్‌ భారతి, ఇతర కుటుంబ సభ్యులు నివాళులర్పించిన వాళ్లలో ఉన్నారు. ఈ సందర్భంగా అభిషేక్‌ కుటుంబ సభ్యులను జగన్‌ ఓదార్చారు. 

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి.. వైఎస్సార్‌సీపీ కీలక నేతగా, వైఎస్‌ జగన్‌(YS Jagan)కు దగ్గరిబంధువని తెలిసిందే. వైఎస్‌ జగన్‌ పెద్దనాన్న వైఎస్‌ ప్రకాష్‌రెడ్డి మనవడే ఈ అభిషేక్‌. అయితే కొద్దిరోజులుగా డెంగీ జ్వరంతో అభిషేక్‌ బాధపడుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. 

 

అంతకు ముందు.. పులివెందులోని స్వగృహంలో అభిషేక్‌ రెడ్డి(ys abhishek reddy) పార్థీవదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. దీంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు పులివెందుల చేరుకున్నారు. అభిషేక్‌కు భార్య, ఇద్దరు పిల్లలు. చిన్నవయసులోనే అభిషేక్‌ మృతి చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 

అంత్యక్రియలు పూర్తి
పులివెందులలో వైఎస్‌ అభిషేక్‌రెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. అంతిమయాత్రలో వైఎస్‌ జగన్‌, ఎంపీ అవినాష్‌ రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో అభిమానులు దారి పొడవునా అభిషేక్‌ రెడ్డి చిత్రపటాలు ప్రదర్శిస్తూ వీడ్కోలు పలికారు.

సుశీలమ్మకు పరామర్శ
అభిషేక్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఈ ఉదయం బెంగళూరు నుంచి జగన్‌ దంపతులు పులివెందుల చేరుకున్నారు. అంతకు ముందు.. వైఎస్‌ జగన్‌ తన మరో బంధువు వైఎస్‌ ఆనందరెడ్డి ఇంటికి వెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మను పరామర్శించి.. వాళ్ల యోగకక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

 

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)