Breaking News

మద్యం మత్తులో పోలీసులపై యువకుల దాడి

Published on Tue, 09/09/2025 - 05:10

కంబాలచెరువు (రాజమహేంద్రవరం)­: మద్యం మత్తులో ఒక రౌడీషీటర్, మరో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. రాజమహేంద్రవరంలో విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్, హోంగార్డుపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాజమహేంద్రవరం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌ నాగబాబు, హోంగార్డు కాళి ఆదివారం రాత్రి విధుల్లో భాగంగా కోటిపల్లి బస్టాండ్‌ వద్దకు వెళ్లారు. 

అక్కడ ఓ జ్యూస్‌ షాప్‌ వద్ద రాజమహేంద్రవరం రూరల్‌ మండలం రాజవోలు ప్రాంతానికి చెందిన రౌడీషీటర్‌ కర్రి దుర్గా సూర్యప్రసన్నకుమార్, రాజానగరం మండలం పాత తుంగపాడుకు చెందిన కట్టుంగ హరీష్, ధవళేశ్వరానికి చెందిన వినోద్‌కుమార్‌ మద్యం మత్తులో వేరే వ్యక్తులతో గొడవపడుతున్నారు. వారిని నాగబాబు, కాళి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. 

దీంతో రెచ్చిపోయిన సూర్యప్రసన్నకుమార్, హరీష్, వినోద్‌కుమార్‌ కలిసి కానిస్టేబుల్‌ నాగబాబు, హోంగార్డు కాళిపై దాడి చేశారు. దుర్భాషలాడుతూ అర్ధగంటకు పైగా కదలనీయకుండా అడ్డుకున్నారు. అనంతరం కానిస్టేబుల్, హోంగార్డు పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)