Breaking News

పెళ్లి చేసుకోకు.. పురుగు మందు తాగి చచ్చిపో..!

Published on Fri, 07/03/2026 - 11:11

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): భవిష్యత్తు గురించి ఎన్నో కలలు..ఆశలతో పెళ్లిపీటలు ఎక్కి ఏడడుగులు నడవాల్సిన యువతి ప్రేమపేరుతో మోసపోయింది. చివరకు కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌తో   ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన గరివిడి మండలంలో తీవ్ర సంచలనం సృష్టించింది. వివాహితుడై భార్య, ఇద్దరు పిల్లలు ఉన్న వ్యక్తి ఆ యువతితో సన్నిహితంగా మెలిగి, అనంతరం ఆమెకు వివాహం కుదరడంతో పెళ్లిని అడ్డుకునేందుకు తీవ్ర వేధింపులకు గురి చేశాడు. 

 కసాయి ప్రియుడి బెదిరింపులు, బ్లాక్‌ మెయిల్‌ను తట్టుకోలేక యువతి పురుగు మందు తాగేయడంతో కుటుంబసభ్యులు గమనించి విజయనగరంలోని ఓ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటనకు సంబంధించి గరివిడి ఎస్సై బి.లోకేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు గరివిడి మండలంలోని తోండ్రంగి గ్రామానికి చెందిన యువతి బలగం అఖిలకు ఇటీవల కుటుంబసభ్యులు వివాహం నిశ్చయించారు. 

ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన మాజీ ప్రియుడు కోరాడ రామునాయుడు ఆమెను ఫోన్‌లో పదేపదే సంప్రదిస్తూ పెళ్లి చేసుకోకు..పురుగు మందు తాగి చచ్చిపో..నేను పురుగు మందు పంపిస్తున్నా, తీసుకుని తాగు అంటూ తీవ్రంగా మానసికంగా వేధించాడు. అంతటితో ఆగకుండా పొరపాటున పెళ్లిపీటలు ఎక్కితే మన ఇద్దరం కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్‌మెయిల్‌ చేశాడు. ఈ బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి మంగళవారం ప్రియుడు పంపించిన పురుగు మందు తాగేసి అపస్మాకర స్థితికి చేరుకుంది. దీంతో ఆమెను  కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా కీ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. మృతురాలి తండ్రి బలగం రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)