Breaking News

విజయవంతంగా యువకుడి గుండె మార్పిడి

Published on Sat, 06/15/2024 - 05:46

తిరుపతి తుడా: స్థానిక టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లో శుక్రవారం ఓ యువ­కుడికి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఐదు గంటలు శ్రమించి వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు... కాకినాడకు చెంది­న ఓ యువకుడు(24) గుండె సంబంధ సమ­స్యతో బాధపడుతూ రెండు నెలలుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. అతనికి గుండె మార్పిడి అనివార్యమని గుర్తించారు. 

ఈ మేరకు నెల రోజుల కిందట ఆ యువకుడి వివరాలను అవయవదాన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. గుండె అందుబాటులోకి వచ్చే వరకు ఆ యువకుడిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అక్కడే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అతని అవయవాలు దా­నం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వ­చ్చారు.

ఈ మేరకు అవయవదాన్‌ వెబ్‌సైట్‌లో వి­వ­రా­లు నమోదు చేశారు. దీంతో శ్రీ పద్మావతి కా­ర్డి­యా­క్‌ కేర్‌ సెంటర్‌ వైద్యులు విశాఖ వెళ్లి బ్రెయిన్‌ డెడ్‌ అ­యి­న యువకుడి గుండెను సేకరించి ప్రత్యేక వి­మానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకు­వచ్చారు. అక్కడి నుంచి గ్రీన్‌ చానల్‌ ద్వారా 19 ని­మి­షాల్లో శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌కు చేర్చారు. వెంటనే 2.15 గంటలకు ఆస్పత్రి డైరెక్టర్‌ డా­క­్టర్‌ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు గుండె మా­ర్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి, సాయంత్రం 7.15 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్యులను పలువురు అభినందించారు. 



15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు
 గుండె మార్పిడి ఆపరేషన్లలో తిరుపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మహా నగరాల్లో అత్యున్నత ప్రమాణాలు కలి­గిన కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్న గుండె మార్పిడి శస్త్రచికిత్సలను టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్‌ కేర్‌ సెంటర్‌లోనూ విజయవంతంగా చేపడుతున్నారు. ఈ ఆస్ప­త్రిని ప్రారంభించిన అనతికాలంలోనే 2,560 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్స­లను చేశారు. అదేవిధంగా శుక్రవారంతో 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూ­ర్తి­చేశారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)