Breaking News

వెళ్లి పోయావా మిత్రమా! 

Published on Mon, 08/07/2023 - 10:48

కోనసీమ: ఊహకు ఊపిరిలా.. ఆశకు శ్వాసలా.. మది నిండా మధుర జ్ఞాపకాలతో సందడి చేశారు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చుకున్నారు.. స్నేహితుల దినోత్సవం వేళ దోస్తులంతా కలసి చేసిన సందడి కొద్ది క్షణాల్లోనే ఆవిరి అయ్యింది. తమ స్నేహితుడు కళ్ల ముందే కాలువలో గల్లంతైన ఘటన చూసిన సహచరులు నిర్ఘాంతపోయారు.

ఈ ఘటన ఎస్‌.యానం కట్టు కాలువ వద్ద జరిగింది. స్నేహితులు, కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అమలాపురం రూరల్‌ మండలం వన్నెచింతలపూడిలో కొత్త కాలనీకి చెందిన చిత్రి ముఖేష్‌ కుమార్‌ (19) తన పదకొండు మంది మిత్రులతో కలసి ఎస్‌.యానం బీచ్‌కు వెళ్లాడు.

అక్కడ ఆట పాటలతో సముద్ర స్నానాలు చేసి సాయంత్రం వరకూ సరదాగా గడిపారు. తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఇంటికి వెళుతూ ఒంటిపై ఉన్న ఇసుకను తొలగించుకునేందుకు బీచ్‌ను ఆనుకుని ఉన్న కట్టు కాలువలో స్నానాలకు దిగారు. సముద్ర పోటు సమయం కావడంతో కాలువలో నీరు ఎక్కువగా ఉంది. దీంతో ముఖేష్‌ కుమార్‌ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. తోటి స్నేహితులు చూస్తుండగానే అతను నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.

స్నేహితులు చేతనైన సాయం చేద్దామనుకున్నా ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. స్నేహితుల దినోత్సవం రోజునే తమ మిత్రుడు ఇలా కొట్టుకుపోతుంటే తట్టుకోలేక హాహాకారాలు చేశారు. ఈ సంఘటనను తెలుసుకున్న ఎస్సై జి.వెంకటేశ్వరరావు, పోలీసులు, గ్రామస్తులు, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. అయినా ముఖే‹Ùకుమార్‌ ఆచూకీ లభ్యం కాలేదు. ఆదివారం రాత్రి వరకూ గాలింపు కొనసాగింది. ముఖేష్‌ కుమార్‌ సోదరుడు తరుణ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వరరావు వివరించారు.  

#

Tags : 1

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)