Breaking News

యువకుడి కిడ్నాప్‌ కలకలం!

Published on Tue, 09/23/2025 - 06:04

తాడేపల్లి రూరల్‌: అప్పటిదాక జ్యూస్‌ షాప్‌ నడిపి... భార్యతో కారులో ఇంటికి వెళ్తున్న యువకుడిని ఐదుగురు వ్యక్తులు అడ్డుకుని తీసుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి స్టేషన్‌ పరిధి ప్రాతూరు రోడ్డులో  జరిగింది. యువకుడి భార్య లక్ష్మీప్రసన్న తెలిపిన వివరాల ప్రకారం... తాడేపల్లి బైపాస్‌ సర్వీస్‌ రోడ్డులో కె.స్రవంత్‌రెడ్డి జ్యూస్‌ షాప్‌ నడుపుతున్నాడు. సోమ­వారం సాయంత్రం స్నేహితుడి కారులో ప్రాతూరులోని ఇంటికి వెళ్తుండగా కుంచనపల్లి దాటాక ఓ కారు వచ్చి అడ్డగించింది. తొలుత ఇద్దరు, తర్వాత ముగ్గురు కిందకు దిగారు.

తాము పోలీసులమని, యాక్సిడెంట్‌ కేసులో నీ భర్తను విచారించడానికి తాడేపల్లి తీసుకె­ళ్తున్నామని చెప్పారు. కానీ, ప్రాతూరు వైపు వెళ్తుండడంతో లక్ష్మీప్రసన్న అనుమానించింది. తమ కారులో ఉన్న వ్యక్తిని ప్రశ్నించగా అతను సమాధానం చెప్పలేదు. వాహనాన్ని తిప్పు­కొని తాడేపల్లి బైపాస్‌ వైపు వెళ్లాడు. స్రవంత్‌రెడ్డిని ఒకవైపు, తాము ప్రయాణి­స్తున్న కారును తాడేపల్లి వైపు తీసుకువెళ్లారు. 

రూటు మార్చ­డంతో... 100కు డయల్‌ చేసినా స్పందన రాలే­దని, సంఘటనపై తాడేపల్లి పోలీస్‌­స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని లక్ష్మీ­ప్రసన్న తెలిపింది. కాగా, ఆమె ఇచ్చిన ఫిర్యా­దుపై స్పం­దించిన తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. ఎస్‌ఐ ప్రతాప్‌ సిబ్బందితో కలిసి సీసీ కెమెరా­లను పరిశీలించారు. స్రవంత్‌రెడ్డిని తీసుకెళ్లింది పోలీ­సులే అయి ఉంటారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, స్రవంత్‌కు ఎవరితోనూ గొడవల్లేవని, కేసులు లేవని పోలీసులు ఎందుకు తీసుకెళ్తారని బంధువులు వ్యాఖ్యానిస్తున్నారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?