Breaking News

భర్త సంపాదన ప్రియుడిపాలు!

Published on Sat, 03/29/2025 - 11:16

కాకినాడ: భార్య వివాహేతర సంబంధంతో జీవితంపై విరక్తి చెంది కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న యువకుడి కేసులో ముగ్గురిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ ఎం.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల మేరకు మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన చల్లా దుర్గారావు (29) ఈ నెల 25 వ తేదీన పెరవలి లాకుల వద్ద మోటార్‌ సైకిల్‌ వదలి కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి 26వ తేదీన ఇరగవరం మండలం రాపాక వద్ద శవమై తేలిన విషయం తెలిసిందే. అతడు రాసిన సూసైడ్‌ నోట్‌ ప్రకారం తన చావుకు కారణమైన ఖండవల్లి గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్, మోత్రపు శివ ప్రసాద్, మృతుడి భార్య చల్లా దివ్య కుమారి కారణమని పేర్కొన్నాడు.

ఫిర్యాదుదారు చల్లా వెంకట సుబ్బారావు ఇచ్చిన వివరాలు, గ్రామ పెద్దల సమాచారం, సాంకేతిక ఆధారాల మేరకు వారి ముగ్గురిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచినట్టు తెలిపారు.  తన భార్య అదే గ్రామానికి చెందిన మోత్రపు అమోఘ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయాన్ని దుర్గారావు, కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు అమోఘ్‌ను ఇంటికి వెళ్లి నిలదీశారు. దీంతో అతడితో పాటు తండ్రి శివప్రసాద్‌లు దుర్గారావును దుర్భాషలాడి అవమానించారు.

దీంతో అతడు మనస్తాపం చెంది తన చావుకు వారు ముగ్గురే కారణమని, తాను దుబాయి వెళ్లి సంపాదించినదంతా దివ్యకుమారి ప్రియుడికి దోచిపెట్టిందని, దీంతో తాను ఆర్థికంగా చితికిపోయానని, వివాహేతర సంబంధంతో తీవ్ర మనస్తాపం చెందానని సూసైడ్‌ నోట్‌ రాసి కాల్వలోకి దూకాడు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం తణుకు కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్టు ఎస్సై తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)