Breaking News

భార్యకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం .. భర్త అనుమానాస్పద మృతి!

Published on Wed, 03/19/2025 - 08:29

వెదురుకుప్పం : ‘ఐటీ ఉద్యోగం కోసం హైదరాబాద్‌ వెళ్లాడు.. వివాహమై 14 నెలలు అవుతోంది. సంతోషంగా ఉన్నాడనుకున్నాం. అక్కడ ఏం జరిగిందో ఏమో శవమై తిరిగి వచ్చాడంటూ..’ మండలంలోని కొమరగుంట గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం మేరకు.. కొమరగుంట గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి కుమారుడు జి.మహేష్‌ (30)కి దామరకుప్పం గ్రామానికి చెందిన గుణవర్ధన్‌రెడ్డి కుమార్తె అనితకు 14 నెలల క్రితం ప్రేమించుకుని పెద్దల ఆమోదంతో వివాహం చేసుకున్నారు.

మహేష్‌ భార్య అనిత సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో జాబ్‌ చేస్తోంది. వీరు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. సోమవారం సాయంత్రం కొమరగుంటలో ఉన్న మహేష్‌ తండ్రి చంద్రశేఖర్‌రెడ్డికి ఫోన్‌ ద్వారా దిగ్బ్రాంతికర సమాచారం అందింది. ఉరి వేసుకుని చనిపోయినట్లు మహేష్‌ భార్య అనిత కుటుంబ సభ్యులకు తెలిపింది. ఆ సమాచారం అందింన వెంటనే కుప్పకూలిపోయారు. మహే ష్‌ మృతి చెందడంతో భార్య అనిత అక్కడే పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి ఘటనను పరిశీలించి ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదు చేసి శవపరీక్ష కూడా నిర్వహించారు.

ఆనవాళ్లు లేకుండా చంపేశారు..బంధువుల ఆందోళన
ఘటనకు సంబంధించి కొమరగుంట గ్రామస్తులు మంగళవారం ఉదయం పచ్చికాపల్లం–పెనుమూరు ప్రధాన రహదారిపై పెద్ద ఎత్తున భైఠాయించారు. మహేష్‌ను పథకం ప్రకారం ఎలాంటి ఆనవాళ్లు కనిపించకుండా చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు ధర్నా చేపట్టారు. భార్య అనిత కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందంటూ.. అది ఆత్మహత్య కాదు.. హత్యగావించినట్లు బంధువులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న కార్వేటినగరం సీఐ హనుమంతప్ప, ఎస్‌ఐలు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మోహరించారు. 

ఈసందర్భంగా తమకు న్యాయం జరిగే వరకూ మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని రోడ్డుపైనే భీష్మించుకూర్చున్నారు. పోలీసులు ఎంత సర్ది చెప్పినా వినిపించుకోలేదు. ఓ దశలో పోలీసులకు ఆందోళన కారులకు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. పోలీసుల వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆందోళన చేపట్టడంతో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమైంది. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం ఆందోళన చేస్తున్న సమ యంలో శవం రావడంతో స్థానికులు మరింత కోపోద్రిక్తులై ఆందోళనను తీవ్ర తరం చేశారు. 

మృతదేహం వెంట భార్య అనిత రాకపోవడంతో అనుమానం మరింత బలమైంది. మృతదేహాన్ని పక్కన పెట్టి నిరసన తెలిపారు. ఇది ముమ్మాటికీ హత్యే అంటూ కుటుంబ సభ్యులు నినాదాలు చేశారు. ఎట్టకేలకు రెవెన్యూ, పోలీసు శాఖ సమ న్వయంతో మధ్యాహ్నం కొమరగుంట గ్రామస్తులతో చర్చించి అనిత తరపున రావాల్సిన నగదు, బంగారాన్ని ఇచ్చేలా రాజీ కుదర్చడంతో ధర్నాను విరమింప చేశారు. ఈ ఆందోళనలో కానిస్టేబుల్‌కు గాయాలైనట్లు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం కొమరగుంట సమీపంలో మహేష్‌కు అంత్యక్రియలు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కేసు నమోదైనట్లు స్థానిక పోలీసులు పేర్కొన్నారు.

Videos

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)