Breaking News

ప్లాట్‌ఫామ్‌ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి..

Published on Thu, 03/20/2025 - 11:58

నంద్యాల జిల్లా: అనంతపురం జిల్లా గుత్తి రైల్వే స్టేషన్‌ బుధవారం మధ్యాహ్నం ప్రయాణికులతో రద్దీగా ఉంది.. అందరూ చూస్తుండగానే ఓ యువకుడు పట్టాలపైకి చేరుకొని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హఠాత్తు సంఘటనతో అక్కడి ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. కొలిమిగుండ్ల మండలం గొర్విమానుపల్లెకు చెందిన రామదాసు శ్రీరాములు, మునెమ్మ దంపతులకు కుమార్తె, కుమారుడు సంతానం కాగా కూతురుకు వివాహమైంది. 

కుమారుడు మహేంద్ర (25) గతంలో గ్రామంలో వలంటీర్‌గా పని చేశాడు. ప్రస్తుతం అనంతపురం జిల్లా యాడికి సమీపంలోని ఓ సిమెంట్‌ పరిశ్రమలో పని చేస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే మార్గం లేక ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలు చోట్ల గాలిస్తున్నారు. 

ఈ క్రమంలో బుధవారం గుత్తి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువకుడు రైలు వేగంగా వస్తుండగా ప్రయాణికులు చూస్తుండగానే ప్లాట్‌ఫామ్‌ పైనుంచి దూకి పట్టాలపై తల పెట్టి పడుకోవడంతో రైలు అతనిపై వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వివరాలు ఆరా తీయగా గొర్విమానుపల్లెకు చెందిన మహేంద్రగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)