Breaking News

‘ఉద్యోగం లేదు.. బతకాలని లేదు’

Published on Thu, 08/07/2025 - 13:44

పల్నాడు జిల్లా: మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25) బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస రెడ్డి, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్‌ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్‌ పూర్తి చేసిన చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మూడేళ్లుగా ప్రయతి్నస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. 

దీంతో బుధవారం తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఉద్యోగం సాధించలేకపోయానని.. తానిక బతకలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి ఫోన్‌ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం హైదరాబాద్‌ లింగంపల్లి సమీపంలో రైలు కిందపడి బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతిచెందడంతో శ్రీనివాస్‌ రెడ్డి, భూలక్ష్మి బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో బుధవారం రాత్రి బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన పెదగార్లపాడు తీసుకువచ్చారు.

    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)