Breaking News

మా కుమారుడిని ఇంటికి చేర్చండి

Published on Sun, 07/21/2024 - 05:55

అంబాజీపేట:  ఉపాధి కోసం సౌదీ వెళ్లిన ఓ యువకుడిని ఏజెంట్‌ మోసం చేయడంతో ఎడారిలో చిక్కుకుపోయాడు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమ కుమారుడిని తమ ఇంటికి చేర్చాలని అతని తల్లిదండ్రులు కోరుతున్నారు. బాధిత యువకుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలంలోని ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరెళ్ల సత్తిరాజు, మరియమ్మ దంపతుల కుమారుడు సరెళ్ల వీరేంద్రకుమార్‌ ఈ నెల 9వ తేదీన ఏజెంట్, మధ్యవర్తుల సాయంతో ఖతార్‌లో వంట మనిíÙగా పనిచేసేందుకు వెళ్లాడు.

అతను 10వ తేదీన ఖతార్‌కు చేరగా, అక్కడ వంట మనిషి ఉద్యోగం ఇవ్వలేదు. అతడ్ని ఖతార్‌ నుంచి ఈ నెల 11 తేదీన సౌదీ అరేబియా పంపించారు. అక్కడ ఎడారిలో ఒంటెలకాపరిగా నియమించారు. భగభగ మండే ఎండ తీవ్రత వల్ల ఎడారిలో ఒంటెలకాపరిగా పని చేస్తున్న వీరేంద్రకుమార్‌ ఆరోగ్యం దెబ్బతిన్నది. తనకు రక్తపు వాంతులు అవుతున్నాయని, తాగేందుకు నీరు, తినేందుకు ఆహారం దొరకడం లేదని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వీరేంద్రకుమార్‌ వాట్సాప్‌ ద్వారా తన తల్లిదండ్రులు సత్తిరాజు, మరియమ్మ, సోదరుడు రవికుమార్‌తోపాటు బంధువులు, స్నేహితులకు తెలియజేశాడు.

తన ఆరోగ్యం క్షీణిస్తోందని, వెంటనే స్వగ్రామం తీసుకువెళ్లేందుకు చర్యలు తీసుకోవాలని కన్నీటిపర్యంతమవుతూ వేడుకున్నాడు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ నెల 19న అమరావతిలోని ఏపీ నాన్‌ రెసిడెండ్‌ తెలుగు సొసైటీ(ఏపీ ఎన్‌ఆర్‌టీఎస్‌) అధికారులను కలిసి సౌదీలో వీరేంద్రకుమార్‌ పడుతున్న ఇబ్బందులను తెలియజేసి సాయం చేయాలని కోరారు. అమలాపురం ఎంపీ గంటి హరీ‹Ùమాధుర్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ, తహసీల్దార్‌ల దృష్టికి కూడా సమస్యను తీసుకువెళ్లి వీరేంద్రకుమార్‌ను స్వస్థలానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని విన్నవించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)