Breaking News

సాయం చేసినా సహించలేరా? 

Published on Wed, 06/14/2023 - 05:46

సాక్షి ప్రతినిధి, గుంటూరు: బాధితులకు సాయం చేసినా ఎల్లో మీడియా సహించలేకపోతోంది! రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడమే ఏకైక లక్ష్యంగా నిత్యం దుష్ప్రచారాలకు తెగిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. సీఎం జగన్‌ హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలికి  కాన్వాయ్‌లో వస్తుండగా అచ్చంపేట మండలం ముత్యాల గ్రామవాసి పువ్వాడ సాయి, అతడి తల్లి తమ సమస్యను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. వారిని చూసిన ముఖ్యమంత్రి తన వద్దకు తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

అయితే  ముఖ్యమంత్రి పట్టించుకోకుండా బస్సులో ముందుకు వెళ్లిపోయారంటూ ఎల్లో మీడియా అబద్ధాలకు తెగించింది. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం చేసింది. నిజానికి బాధితుల సమస్యను తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే స్పందించారు. చెయ్యి విరిగిన సాయి చికిత్స కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందించడంతోపాటు ఫిజియోథెరపీ అందించాలని ఆదేశించారు. ఈ మేరకు నరసరావుపేట కలెక్టర్‌ కార్యాలయంలో అదేరోజు సాయంత్రం పువ్వాడ సాయి కుటుంబ సభ్యులకు తక్షణ సాయం రూ.లక్ష అందించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యాధునిక వైద్య చికిత్స అందించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. వివిధ సమస్యలతో ముఖ్యమంత్రి జగన్‌ను కలసిన మరో 21 మందికి తక్షణ సాయంగా రూ.32.50 లక్షలు ఆరి్థక  సాయం అందించడంతోపాటు అవసరమైన వారికి వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు. దీనిపై బురద చల్లుతూ సామాజిక మాధ్యమాల్లో దు్రష్పచారాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)