Breaking News

కూటమి సర్కార్‌ ‘రాజకీయ కూల్చివేతలు’ షురూ!

Published on Tue, 02/25/2025 - 04:17

నర్సీపట్నం: రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అరెస్టులు, బెదిరింపులతో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న బాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఇప్పుడు వైఎస్సార్‌సీపీ నాయకుల భవనాలే లక్ష్యంగా ‘రాజకీయ కూల్చివేతలను’ షురూ చేసింది.   అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో  రెండు నెలల క్రితం గచ్చపువీధిలోని చిటికెల కరుణాకర్‌ భవనాన్ని కూల్చివేసిన మున్సిపల్‌ అధికారులు, తాజాగా శారదానగర్‌లోని బీసీ కార్పొరేషన్‌ స్టేట్‌ మాజీ డైరెక్టర్‌ కర్రి శ్రీనివాసరావు సోదరుడు సత్యనారాయణ భవనం కూల్చివేతకు పాల్పడ్డారు.  తహసీల్దార్‌ రామారావు సోమవారం ఉదయం 7 గంటలకే  భారీ సంఖ్యలో పోలీసులు, రెవెన్యూ సిబ్బందిని వెంట పెట్టుకొని బిల్డింగ్‌ దగ్గరకు చేరుకున్నారు.

విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌ గణేష్‌ కూడా పార్టీ నాయకులతో భవనం వద్దకు చేరుకున్నారు. నోటీసులో రెండు రోజులు గడువు ఇచ్చినందున, భవనాన్ని యజమానే తొలగించుకునేందుకు సహకరించాలని మాజీ ఎమ్మెల్యే తహసీల్దార్‌ను కోరినప్పటికీ వినలేదు. భవనంలో ఫర్నిచర్‌ను రెవెన్యూ సిబ్బంది బయటకు తీస్తుండగా భవన యజమాని, పార్టీ నాయకులు అడ్డుకున్నారు.

తనపై కక్షతోనే స్పీకర్‌ కావాలనే తన సోదరుని  బిల్డింగ్‌ను కొట్టిస్తున్నాడని, ఇలా ఎంత మందిని నాశనం చేస్తారంటూ శ్రీనివాసరావు ఆవేదన చెందారు. కాగా, 10.47 గంటలకు కూల్చివేత పనులు నిలిపి వేయాలంటూ హైకోర్టు  ఇంజక్షన్‌ ఉత్తర్వులు ఇవ్వడంతో అధికారులు అక్కడ నుండి జారుకున్నారు. కానీ అప్పటికే రెండో ఫ్లోర్‌ శ్లాబ్‌ సగం తొలగించారు. కింద పోర్షన్‌ గోడలు తొలగించి ద్యామేజ్‌ చేశారు.  

అయ్యన్నపాత్రుడి కక్షపూరిత చర్యలు: మాజీ ఎమ్మెల్యే గణేష్‌  
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గణేష్‌ ఈ సందర్భంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పీకర్‌ అకృత్యాలను న్యాయస్ధానాల ద్వారా ఎదుర్కొంటామన్నారు. అయ్యన్నపాత్రుడు కుట్రలపై కోర్టుల్లో న్యాయం జరుగుతుందని క్యాడర్‌కు భరోసా ఇచ్చారు. అధికారం శాశ్వతం కాదన్న విషయం స్పీకర్‌ గ్రహించాలని  హెచ్చరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్‌ చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, కో–ఆప్షన్‌ సభ్యులు షేక్‌ రోజా, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్‌ తదితరులు ఆయన వెంట ఉన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)