Breaking News

రేపు వైఎస్ జగన్‌ ప్రెస్‌మీట్‌

Published on Wed, 06/18/2025 - 18:01

సాక్షి,గుంటూరు: రేపు వైఎస్ జగన్‌ ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న చంద్రబాబు అరాచకపాలనపై సుదీర్ఘంగా ప్రెస్‌మీట్‌లో మాట్లాడనున్నట్లు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల పర్యటనలో వైఎస్‌ జగన్‌ తెలిపారు.

 వైఎస్‌ జగన్‌ బుధవారం రెంటపాళ్లలో పర్యటించారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామంలో పర్యటించిన ఆయన.. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరావు ఘటనను ప్రస్తావించారు. అంతకు ముందు.. నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించి.. ఆ కుటుంబాన్ని పరామర్శించి.. అనంతరం వైఎస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడారు.

‘రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అనడానికి కోర్లకుంట వెంకటేశ్వరరావు కుటుంబానికి జరిగిన అన్యాయమే నిదర్శనమని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌లు జ‌రుగుతోంది. చంద్ర‌బాబు నేతృత్వంలో రాష్ట్రంలో జ‌రుగుతున్న అన్యాయాల మీద రేపు ఉదయం సుదీర్ఘ‌మైన ప్రెస్‌మీట్ పెట్టి ప్ర‌జ‌లంద‌రికీ వివ‌రించ‌డం జ‌రుగుతుంది.

చంద్ర‌బాబుకి, ఆయ‌న‌కి వ‌త్తాసు పలుకుతున్న పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉన్న కొంద‌రు.. అంద‌రూ కాదు.. కొందరికి మాత్ర‌మే ప్ర‌త్యేకంగా చెబుతున్నా. చూస్తూ చూస్తూ ఇప్ప‌టికే ఒక ఏడాది గ‌డిచిపోయింది. మ‌రో మూడు నాలుగేళ్ల‌లో మా ప్రభుత్వం అధికారంలోకి వ‌స్తుంది. మా ప్ర‌భుత్వం వ‌చ్చాక ఒక్కొక్క‌రికీ సినిమా చూపిస్తా. ఎందుకంటే నాగ‌మ‌ల్లేశ్వ‌ర‌రావు కుటుంబానికి చేసిన అన్యాయమే రెడ్ బుక్ కార‌ణంగా ప్ర‌తి గ్రామంలోనూ క‌నిపిస్తోంది. ప్ర‌తి గ్రామంలో కనిపిస్తున్న అన్యాయాలను చూసి ప్ర‌తి అధికారికీ ఒక‌టే చెబుతున్నా, ఈ అన్యాయాల‌లో మీరు భాగ‌స్వాములు కావొద్దు. భాగస్వాములైతే చంద్ర‌బాబుతోపాటు మిమ్మల్ని కూడా బోను ఎక్కించే కార్య‌క్ర‌మం చేస్తాన‌ని వైఎస్ జగన్‌ హెచ్చరికలు జారీ చేశారు.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)