Breaking News

మంత్రి మనోహర్‌కు మహిళల షాక్‌!

Published on Tue, 08/05/2025 - 07:20

పాడేరు: ‘గ్యాస్‌ సిలిండర్లు ఉచితమన్నారు. కానీ రూ.1,050 చెల్లిస్తున్నాం. కొందరికి రాయితీ సిలిండర్ల నగదు అసలు జమ అవలేదు. ఎప్పుడు అవు­తుంది. ఇప్పటివరకూ ఉచిత సిలిండర్‌ ఒకటి మాత్రమే ఇచ్చారు. ఉన్న పింఛన్లు ఊడగొట్టారు. జీసీసీ డిపోలో పంచదార, బియ్యం తప్ప మరేమీ ఇవ్వడం లేదు. ఎప్పుడు ఇస్తారు?’ అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను మహిళలు నిలదీశారు. 

అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మినుములూరులో పలువురు మహిళ­లను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లా­డుతూ ఉపాధి పనులు చేసి రెండు నెలలు కావస్తున్నా కూలీ సొమ్ము జమ చేయడం లేద­న్నా­రు. కూటమి అధికారంలోకి వచ్చాక తమ గ్రామ­ంలో 15 మంది పింఛన్లు ఎందుకు తొలగించారని సర్పంచ్‌ లంకెల చిట్టమ్మ ప్రశ్నించారు. మంత్రి మాట్లాడుతూ పౌరసరఫరాల శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామన్నారు. జీసీసీ డిపో­ల్లో మరి­న్ని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుతామన్నారు. 

గ్యాస్‌ సిలిండర్ల కోసం ఏజెన్సీ అదనంగా నగదు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసు­కుంటామన్నారు. కమాండర్‌ జీపుల సహాయంతో వృద్ధుల ఇళ్ల వద్దకే రేషన్‌ సరుకులు సరఫరా చేస్తామన్నారు. అనంతరం ఆయన సుండ్రుపుట్టు డీఆర్‌ డిపోతో పాటు పాడేరు జీసీసీ గోదామును పరిశీలించారు. కాగా, మంత్రి నాదెండ్ల పర్యటనలో జీసీసీ చైర్మన్, టీడీపీ నేత కిడారి శ్రావణ్‌ కుమార్‌ పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది.

 

 


 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)