Breaking News

AP: ఉద్రిక్తత.. వైన్‌షాప్‌ మూసేయాలని మహిళల ఆందోళన

Published on Thu, 10/24/2024 - 10:55

సాక్షి, నెల్లూరు: నెల్లూరు జగదీష్‌నగర్‌లో ఉద్రిక్తత నెలకొంది. స్థానికంగా నూతనంగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని ఎత్తివేయాలంటూ మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపును తొలగించాలని డిమాండ్‌ చేశారు.మహిళలు, స్థానికులు షాపు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో తీవ్రతరంగా మారింది దుకాణం కౌంటర్‌ వద్దకు వెళ్లి నిర్వాహకులను హెచ్చరించారు.

అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం షాపు వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా ఆందోళనలు చేస్తున్నా.. ఎక్సైజ్‌ అధికారులు స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా దుకాణాన్ని తొలగించాలని లేనిపక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. జగదీష్‌నగర్‌లో మద్యం షాపు వద్ద స్థానికుల ఆందోళనకు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

ఇదిలా ఉండగా వైన్ షాప్ నిర్వాహకునికి మద్దతుగా పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అంతేగాక మహిళను బెదిరించేందుకు వైన్‌షాప్‌ నిర్వాహకులు రౌడీలను తీసుకొచ్చారు. మరోవైపు షాప్ మూసేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తమకు ళలకు అన్యాయం జరిగితే రాని పోలీసులు.. మద్యం షాప్ ఓనర్‌కు మద్దతుగా వచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

Videos

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)