Breaking News

మొరాయించిన ఆర్టీసీ బస్సు.. తోసుకెళ్లిన మహిళా ప్రయాణికులు

Published on Wed, 08/27/2025 - 02:41

పెనుమంట్ర: రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం పేరుతో ఆర్టీసీ బస్సుల్లో స్త్రీలకు కల్పించిన ఉచిత ప్రయాణంలో మహిళలకు చేదు అనుభవం ఎదురైంది. మహిళలు తాము ఎక్కిన బస్సును తామే తోసుకువెళ్లిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం బట్టల మగుటూరు బస్టాండ్‌ సెంటర్లో మంగళవారం చోటుచేసుకుంది. తాడేపల్లిగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో ఆచంట వెళ్తుండగా బట్టల మగుటూరు బస్టాండ్‌కి వచ్చే సమయానికి ఉన్నట్లుండి రోడ్డుపై ఆగిపోయింది. దాన్ని తిరిగి స్టార్ట్‌ చేయడానికి డ్రైవర్‌ ఎంత ప్రయత్నం చేసినా మొరాయించింది.

దీంతో మహిళలే బస్సును తోసి ముందుకు నడిపించారు. భీమవరం, తాడేపల్లిగూడెం బస్‌ డిపోలలో కాలం చెల్లిన బస్సులను పెనుమంట్ర రూట్లో తాడేపల్లిగూడెం– ఆచంట– నరసాపురం, రాజమండ్రి– భీమవరం వెళ్తున్న ఉచిత సర్విసులుగా నడపడంతో ఆ బస్సులు మార్గం మధ్యలో నిలిచిపోతున్నాయి. సోమవారం భీమవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు బ్రాహ్మణ చెరువు వద్ద యాక్సిల్‌ రాడ్‌ విరిగి పోయింది.

ఆ సమయంలో బస్సు నెమ్మదిగా వెళుతుండటంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ రూట్లో బస్సులు కిక్కిరిసిపోయి మహిళలు హ్యాండిల్‌ రాడ్లు పట్టుకుని వేలాడుతూ ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పటికైనా తాడేపల్లిగూడెం–ఆచంట, భీమవరం–రాజమండ్రి రూట్‌లలో కండిషన్‌లో ఉన్న బస్సులు నడపాలని మహిళ ప్రయాణికులు కోరుతున్నారు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)