Breaking News

అపర కాళికలై అ‘సుర’ సంహారం

Published on Tue, 12/09/2025 - 05:10

జె.పంగులూరు: మద్యం మహమ్మారిపై మహిళలు ధ్వజమెత్తారు. అసురపాలనపై అపర కాళికలై దునుమాడారు. బెల్టుషాపులపై దాడి చేసి అక్రమంగా దాచిన మద్యాన్ని తీసుకొచ్చి నడివీధిలో తగలెట్టారు. ఇకపై మద్యం అమ్మితే ఖబడ్దార్‌ అని హెచ్చరించారు.  బాపట్ల జిల్లా జే పంగులూరు మండలం కోటపాడు గ్రామంలో సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది. మహిళామూర్తుల ధర్మాగ్రహానికి గ్రామస్తులంతా సంఘీభావం పలికారు. కోటపాడులో ఏడు బెల్టుషాపులు నడుస్తున్నాయి. వీటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. భార్యాభర్తల మధ్య కలహాలు రేగుతున్నాయి.

పచ్చని సంసారాల్లో చిచ్చురేగుతోంది. దీంతో పిల్లల భవిష్యత్తు నాశనమవుతోంది. ఈ దాష్టికాలను భరించలేని మహిళలంతా సోమవారం రాత్రి నడుంబిగించారు. ఊళ్లో బెల్టుషాపులు ఉండడానికి వీల్లేదని నిర్ణయించుకున్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు డి.రమాదేవి ఆధ్వర్యంలో  దళితకాలనీలో సమావేశమై ఉద్యమానికి ఉద్యుక్తులయ్యారు. సమీపంలో ఉన్న బెల్టుషాపులపైకి దూసుకెళ్లారు. 

దాచి ఉంచిన మద్యం సీసాలను తీసుకొచ్చి నడివీధిలో తగలబెట్టారు. వీరి ధర్మాగ్రహానికి గ్రామస్తులు సంఘీభావం తెలిపారు. ఇకపై గ్రామంలో మద్యం అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం నేత రమాదేవి మాట్లాడుతూ బీచ్‌లలో ఆడ, మగ మద్యం తాగితే అప్పుడు పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని శాసనసభ స్పీకర్‌ ఆయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. ప్రజల చేత మద్యం తాగించేందుకు ప్రభుత్వ పెద్దలే ముందుంటే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Videos

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)