పెళ్లి చేసుకుంటానని ప్రేమించి మోసం

Published on Wed, 07/29/2026 - 12:49

కడప అర్బన్‌: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువకుడు ప్రేమించాడు.. ఇప్పుడు నిరాకరించడంతో యువతి అతని ఇంటి ముందు బైఠాయించి ఆందోళనకు దిగింది. ఈ ఘటన కడప నగరంలోని రామకృష్ణ నగర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. బాధిత యువతి అనూష కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. గత ఐదేళ్లుగా తాను, విజయ్‌ పరస్పరం ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సన్నిహితంగా మెలిగాడని ఆమె తెలిపింది. 

ఇప్పుడు పెళ్లి విషయాన్ని ప్రస్తావించగానే విజయ్‌ ముఖం చాటేస్తూ తప్పించుకుంటున్నాడని ఆరోపించింది. అతనికి వారి తల్లిదండ్రులు వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయమై ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయితీలు జరిగినప్పటికీ తనను ప్రేమించిన యువకుడు విజయ్‌ వైఖరిలో మార్పు రాలేదని వాపోయింది. దీంతో న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ నేరుగా ప్రియుడి ఇంటి ముందు కూర్చొని నిరసన చేపట్టింది.

 దీంతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమాచారం అందుకున్న బ్లూ కోల్ట్స్‌ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని యువతితో మాట్లాడారు. సమస్యపై అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే చట్టపరంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని సూచించారు. ఈ ఘటనపై రిమ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ సీఐ రాజగోపాల్‌ను వివరణ కోరగా.. ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు. బాధిత యువతి పోలీస్‌స్టేషన్‌కు నేరుగా వచ్చి ఫిర్యాదు చేస్తే చట్టప్రకారం విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని వివరించారు.

 

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)