Breaking News

ఆటోడ్రైవర్‌తో వివాహేతర సంబంధం.. చివరికి!

Published on Sat, 01/17/2026 - 07:45

అజిత్‌సింగ్‌ నగర్‌ (విజయవాడ సెంట్రల్‌): భర్తతో విభేదాల కారణంగా విడిపోయి... వేరొకరితో సహజీవనం చేస్తున్న ఆమె అతడి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం కేదారేశ్వరపేట 8వ లైన్‌కు చెందిన మహ్మద్‌ ఉసీనా (36) భర్తకు దూరంగా ఉంటూ కొడుకు, కూతురుతో కలిసి వేరుగా జీవిస్తోంది. 

మంగళగిరి సమీపంలోని నులకపేట ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్‌ కొల్లిపర సాయి శివకుమార్‌(40)తో సహజీవనం చేస్తోంది. ఈమె కుమార్తె ఎండీ సోని (19)కి కొంతకాలం క్రితం వివాహం కాగా ఆమె భర్తతో గొడవలు పడి పుట్టింటికి వచ్చేసింది. సోని రెండో వివాహం విషయమై శివకుమార్, ఉసీనాకు మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఉసీనా గది నుంచి పెద్దగా అరుపులు వినిపించాయి. సోని వెళ్లి చూడగా ఉసీనాపై శివకుమార్‌ విచక్షణారహితంగా దాడి చేస్తూ,  గొంతు నులుముతూ కనిపించాడు. సోని భయంతో కేకలు వేయగా రోకలిబండతో ఆమె తల పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. 

రక్తంతోనే ఆమె బయటకు పరుగులు తీసింది. వారి కేకలు విన్న స్థానికులు వచ్చి చూసేలోపు శివకుమార్‌ ఆటోతో పరారయ్యాడు. గది లోపలకు వెళ్లి చూడగా ఉసీనా మృతి చెంది కనిపించింది. సీఐ బీహెచ్‌ వెంకటేశ్వర్లు సిబ్బందితో ఘటనా స్థలికి చేరుకుని సోనిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉసీనా కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)