CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం
Breaking News
పలాస వైఎస్సార్సీపీ ఛైర్మన్ అభ్యర్థిగా తాళాసు శ్రీపద్మ
భారత జట్టు కెప్టెన్గా కృనాల్ పాండ్యా
కాల్వలో పడ్డ బస్సు.. ఎనిమిది మంది మృతి
భారత్కు ట్రంప్ భారీ ఊరట.. 100% టారిఫ్కు బ్రేక్
పులివెందులకూ పాకిన టీడీపీ దౌర్జన్యకాండ
చంద్రబాబు పాలనలో జంగిల్ రాజ్.. ఆగని పచ్చ మూకల అరాచకాలు!
అర్ధరాత్రి ఖాకీ బూచోళ్లు!.. పల్నాడులో దాష్టీకం
దీప్కే ఎక్కడ?
కడుపునొప్పి అంటూ నాటకం .. 300 మంది సైనికుల మృతికి కారణమయ్యాడు?
చిరుత దాడిలో మహిళ మృతి..
Published on Tue, 06/25/2024 - 20:14
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచర్లలో దారుణం జరిగింది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసింది. మొండాన్ని వదిలేసింది. అయితే కట్టెల కోసం వెళ్లిన మెహరున్నిసా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో మెహరున్నిసా మొండెం లభ్యం కావడంతో హతాశులయ్యారు.
స్థానికులు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు ఏర్పాటు చేశారు. చిరుత కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది.
#
Tags : 1