Breaking News

క్రాస్‌ వీల్‌ నుంచి పడి యువతి మృతి..

Published on Mon, 11/04/2024 - 08:10

చంద్రగిరి(తిరుచానూరు): సరదాగా గడపాలని ఆటవిడుపు కోసం వచ్చిన మహిళా ప్రమాదవశాత్తు మృత్యు వాత పడగా, మరో మహిళా తీవ్ర గాయాలపాలైన ఘటన తిరుచానూ రు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తిరుపతి అర్బన్‌ మండలం సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరి(22) తన స్నేహితురాలు గౌ తమి అలియాస్‌ పండుతో కలసి ఆటవిడుపు కోసం తిరుచానూరు సమీపంలోని శిల్పారామానికి చేరుకుంది. 

సుమారు గంట పాటు శిల్పారామంలో ప లు ప్రాంతాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ క్రమంలో అక్కడే ఏర్పాటు చేసిన క్రాస్‌వీల్‌ ఎక్కారు. ఇద్దరు మహిళలు కూర్చుని తి రుగుతుండగా క్రాస్‌వీల్‌ ఉన్నట్టుండి విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో లోకేశ్వరి, ఆమె స్నేహితురాలు గౌతమి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహుకులు తేరుకుని, 108కు సమాచారం అందించారు. 

అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను ని ర్వహించిన వైద్యులు అప్పటికే లోకేశ్వరి మృతి చెందినట్లు నిర్ధారించగా, గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)