Breaking News

డీఐజీ వికృత చేష్టలు.. వీడియో వైరల్!

Published on Tue, 02/18/2025 - 08:55

సాక్షి, గుంటూరు: తాను సమాజంలో బాధత్య గల స్థాయిలో ఉన్నాననే విషయం ఆయన మరిచిపోయారు. భార్యను శారీరంగా హింసించారు. అంతేకాదు.. మరో మహిళతో సంబంధం పెట్టుకుని కట్టుకున్న ఇల్లాలినే మానసికంగా వేధించారు. విసిగిపోయిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ బాగోతం బయటపడింది. గుంటూరు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ డీఐజీ కిరణ్‌ వికృత చేష్టలు వెలుగులోకి రావడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. 

గుంటూరు పోస్టల్‌ కాలనీకి చెందిన తాళ్లూరి అనుసూయా రాణి, భారత్‌ పేటకు చెందిన వీర్నపు కిరణ్‌ ఇద్దరు గతంలో పాలకొల్లు ఎల్‌ఐసీ శాఖలో అసిస్టెంట్‌లుగా పని చేశారు. 1998 డిసెంబర్‌లో గుంటూరు శారదాకాలనీ చర్చిలో వీళ్ల వివాహం జరిగింది.  అయితే ఈ జంటకు సంతానం కలగకపోవడంతో.. 2002లో ఒక బాలికను దత్తత తీసుకున్నారు. ఈలోపు.. 2009లో కిరణ్‌కుమార్‌కు విజయనగరంలోని రిజిస్ట్రార్‌గా ఉద్యోగం వచ్చింది. ఆపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో 2018లో డీఐజీగా పదోన్నతి లభించింది. అప్పటి నుంచి భర్త కిరణ్‌కుమార్‌ వికృత చేష్టలను ఆమె చూడసాగింది. 

ప్రస్తుతం అనుసూయా రాణి గుంటూరు అమరావతి రోడ్డులోని ఎల్‌ఐసిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.  కిరణ్‌ నెల్లురు జిల్లాలో డిఐజీగా  విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. కొంతకాలంగా వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న కిరణ్‌.. వాళ్లతో ఏకాంతంగా గడిపిన ఫొటోలను భార్యకు పంపి  మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ క్రమంలో.. 

ఇద్దరూ దూరంగా ఉంటున్నారు. పది నెలల క్రితం పెద్దల సమక్షంలో రాతపూర్వకంగా రాసి భర్త కిరణ్‌ కుమార్‌ బాబును తల్లి సంరక్షణలోనే ఉంచేలా.. పోషణ, చదువు బాధ్యతలు తాను చూసుకునేలా రాసి ఇచ్చారు. అయితే అనసూయ శనివారం విజయవాడలోని ఓ శుభకార్యక్రమానికి వెళ్ళారు. అక్కడ ఆమెను చూసి కిరణ్‌ రగిలిపోయారు.  బాబు సంరక్షణ విషయంలో గొడవ జరిగి ఆమెపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా.. ఆస్పత్రి నుంచి తన పుట్టింటికి వెళ్తున్న ఆమెపై మళ్లీ దాడికి యత్నించాడు. దీంతో ఆమె అరండల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. కిరణ్‌కుమార్‌ను అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. ఆ భర్త వికృత చేష్టలపై దర్యాప్తు  చేస్తున్నారు. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)