Breaking News

పెట్టుబడులకు విస్తృత అవకాశాలు

Published on Fri, 07/28/2023 - 05:42

సాక్షి, అమరావతి: పర్యావరణహిత క్లీన్‌ ఎనర్జీకి ఏపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని.. గ్రీన్‌ హైడ్రో­జన్, బయో ఇథనాల్‌ తయారీ ప్లాంట్లను ప్రోత్స­హిస్తోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. దేశంలోనే అతిపెద్ద పెట్రోకెమికల్‌ కారిడార్‌ ఏపీలో విస్తరించి ఉందని.. దీన్ని వినియోగించుకుంటూ పెట్టుబడులు పెట్టాలని కోరారు. పెట్టుబడులకు ఏపీలో విస్తృత అవ­కాశాలున్నాయని.. వాటిని సద్వినియోగం చే­సు­కోవాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న మూ­డో ‘గ్లోబల్‌ కెమికల్స్‌ అండ్‌ పెట్రోకెమికల్స్‌ మా­న్యు­ఫాక్చరింగ్‌ హబ్స్‌ ఇన్‌ ఇండియా’ సదస్సులో గురువారం ప్రవీణ్‌ పాల్గొన్నారు.

దేశంలోనే అతి­పెద్ద పెట్రో కెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ కంపెనీలతో చర్చలు జరుపుతోందని చెప్పారు. వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్, ఇతర ప్రోత్సాహ­కా­లు ఇవ్వడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలి­స్తోందని తెలిపా­రు. విశాఖ–చెన్నై పారిశ్రా­మి­క కారిడార్‌లో పారిశ్రా­మి­క పార్కులు, పోర్టులు అందుబాటులోకి వస్తు­న్నా­­యన్నారు. పారిశ్రా­మి­క పార్కుల ద్వారా తక్షణమే పెట్టుబడులు పెట్ట­డానికి 13,772 ఎకరాల భూమి అందుబాటులో ఉందని వివరించారు. ఇప్పటికే పెట్రో కెమికల్స్‌ రంగంలో హెచ్‌పీసీఎల్, బీపీసీ­ఎల్, ఓఎన్‌జీసీ, కె­యిర్న్, రిలయన్స్, ఆదిత్య బిర్లా, టాటా కెమికల్స్‌ తదితర దిగ్గజ సంస్థలు పెట్టు­బడులు పెట్టాయని తెలిపారు. బయో ఇథ­నాల్‌కు ఏపీ హబ్‌గా మారిందని ప్రవీణ్‌ పేర్కొ­న్నారు.

రాష్ట్రంలోని అవకా­శా­ల­ను సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటికే 20కి పైగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందు­కొచ్చాయ­న్నారు. అనంతరం ప్రవీణ్‌కు­మార్‌.. సౌదీ అరేబి­యా బేసిక్‌ ఇండస్ట్రీస్‌ కార్పొ­రేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్, రీజనల్‌ హెడ్‌ జనార్దన్‌ రామాంజ­నేయులు, సుర్బా­నా జురాంగ్‌ డైరెక్టర్‌ డెన్నీస్‌ టాన్, దీపక్‌ నైట్రేట్‌ సీఎండీ దీపక్‌ సీ మెహతా, నయారా ఎనర్జీ ప్రెసి­డెంట్‌ దీపక్‌ అరో­రా, బేయర్‌ కార్పొ­రేషన్‌ ప్రతిని­ధు­లతో సమావేశమయ్యారు. వీటిలో కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృతికా శుక్లా, అనకాపల్లి కలెక్టర్‌ రవిసుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు