Breaking News

సచివాలయాల వద్ద సంక్షేమ సమాచార బోర్డులు

Published on Sun, 10/08/2023 - 05:22

సాక్షి, అమరావతి :వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు చేసిన మేలును వివరిస్తూ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల వద్ద ప్రత్యేక సమాచార బోర్డులను ప్రభుత్వం ఏర్పాటుచేయనుంది. ఏ పథకంలో ఎంతమంది లబ్ధిదారులకు.. ఎంత మొత్తం లబ్ధిచేకూరిందన్న వివరాలను ఆ సమాచార బోర్డులలో ప్రదర్శిస్తారు.

నెలరోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, పట్టణ ప్రాంతాల్లోని 3,842 వార్డు సచివాలయాల వద్ద ఎక్కడిక్కడ నగర, పట్టణ, జిల్లా, మండల, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఆధ్వర్యంలో ఈ ‘ప్రగతి సమాచార బోర్డు’లను  ఆవిష్కరించేందుకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కార్యాచరణ సిద్ధంచేసింది.

రెండు మూడ్రోజుల్లోనే ఏ సచివాలయానికి సంబంధించిన సమాచార బోర్డును ఆయా సచివాలయానికి పంపేందుకు అధికారులు ఏర్పాటుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లకు తగిన సూచనలు చేస్తూ గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌ లక్ష్మీశ ఇప్పటికే ఆదేశాలు జారీచేశారు. 

వాట్సాప్‌ ద్వారా ప్రజలకు సమాచారం..
ఇక ఈ సంక్షేమ పథకాల సమాచార బోర్డుల ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేయనున్నారు. సచివాలయాల వారీగా ప్రతి కుటుంబానికి ముందుగానే వాట్సాప్‌ ద్వారా సమాచారం ఇవ్వనున్నట్లు గ్రామ, వార్డు సచివాలయ శాఖాధికారులు చెప్పారు. వీటి ఆవిష్కరణ అనంతరం ఓ పది రోజులపాటు వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వివిధ పథకాల ద్వారా పేదలకు ప్రభుత్వం ఎంతమేర లబ్ధిచేకూరుస్తోంది తెలియజేసి, ఆ కుటుంబంలో ఒక సభ్యుని నుంచి ఈ–కేవైసీ రూపంలోధ్రువీకరణ తీసుకుంటారు.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)