Breaking News

జగనన్న కాలనీలకు స్వాగత ద్వారాలు

Published on Thu, 01/11/2024 - 05:16

సాక్షి, అమరావతి:  నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద నిరుపేదలకు ప్రభుత్వం గృహ యోగం కల్పిస్తోంది. జగనన్న కాలనీల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించి గేటెడ్‌ కమ్యూనిటీల రీతిలో తీర్చిదిద్దుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రూ. 75 వేల కోట్ల విలువ చేసే స్థలాలను 30.7 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది.

అంతేకాకుండా ఇంటి నిర్మాణానికి రూ. 2.70 లక్షల ఆర్థికసాయం అందజేస్తోంది. 17,005  వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో కొత్తగా ఊళ్లనే  నిర్మిస్తోంది. కాలనీల్లో మౌలిక వసతులను కల్పించి గేటెడ్‌ కమ్యూనిటీల్లా రూపొందిస్తోంది. ఇందులో భాగంగా 25 అంతకంటే ఎక్కువ ఇళ్లు ఉన్న కాలనీలకు స్వాగత ద్వారాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

 5,684 ఆర్చిల నిర్మాణానికి శ్రీకారం 
21.75 లక్షల (19.13 లక్షల సాధారణ­+2.62 లక్షల టిడ్కో) ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. సాధారణ ఇళ్లు నిర్మిస్తున్న 5,684 కాలనీలకు ఆర్చ్‌లు నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది.

ఇప్పటికే ఈ పనుల కోసం 2,314 ప్రాంతాల్లో టెండర్లను ఖరారు చేయ­గా వీటిలో 594 కాలనీల్లో పనులు ప్రారంభించారు. పలు కాలనీల్లో వీటి నిర్మాణాలు సైతం పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు ఇంటి నిర్మాణానికి అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలుస్తోంది. రూ. 32,909 కోట్లతో కాలనీల్లో రోడ్లు, డ్రెయిన్లు, విద్యుత్, నీటి సరఫరా తదితర సౌకర్యాలను కల్పిస్తోంది. 

Videos

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)