Breaking News

23 నుంచి తెలుగు భాషా వారోత్సవాలు: విజయబాబు

Published on Tue, 08/22/2023 - 17:28

సాక్షి, అమరావతి: తెలుగు వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి 160 వ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 23 నుంచి 29 వరకు వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఏపీ తెలుగు అధికార భాషా సంఘం అధ్యక్షులు విజయబాబు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశానుసారం రాష్ట్రంలో ద్విభాషా విధానాన్ని ప్రోత్సహించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ప్రపంచీకరణ నేపథ్యంలో పిల్లల భవిష్యత్తు అవసరాల కోసం ఆంగ్ల భాషను ప్రోత్సహిస్తూనే నిత్య జీవితంలోనూ, పాలనా వ్యవహారాల్లోనూ తెలుగు భాషను ప్రోత్సహించడానికి గతంలో ఎన్నడూ లేని విధంగా వారం రోజుల పాటు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుతున్నాం. ఈ వారోత్సవాలను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో  ఘనంగా నిర్వహిస్తాం. వారోత్సవాల్లో భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకు, రాష్ట్ర సచివాలయంలోని ఉద్యోగులకు కథలు, కవితలు, అంత్యాక్షరీ పోటీలు నిర్వహిసామని పేర్కొన్నారు.

సాహితీ స్రష్టలను, భాషా సేవకులను, భాషా వారసత్వాన్ని పరిపుష్టం చేసేందుకు కృషి చేస్తున్న వారిని  గుర్తించి సముచిత స్థాయిలో సత్కరిస్తాం. తెలుగు భాషా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా  రాష్ట్ర స్థాయిలో ఈ నెల 23వ తేదీ  ఉదయం 11.30 గంటలకు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈ  వారోత్సవాలు ప్రారంభమౌతాయి.  29 వ తేదీ  మద్యాహ్నం 3.00 గంటలకు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించే కార్యక్రమంతో ముగుస్తాయి.

24వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో, 25వ తేదీ  మధ్యాహ్నం 1.30 గంటలకు విజయవాడలోని ఆంధ్ర లాయోల డిగ్రీ కళాశాలలోను, 26వ తేదీ ఉదయం 11.30 గంటలకు విజయవాడలోని బెజవాడ బార్ అసోసియేషన్‌లో, సాయంత్రం 4.00 గంటలకు గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన్ మందిరంలో, 27 వ తేదీ సాయంత్రం 5.00 గంటలకు విజయవాడ ఘంటసాల సంగీత విశ్వవిద్యాలయంలో, 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలోనూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తామని విజయబాబు పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)