Breaking News

AP: నేడు తుపానుగా మారనున్న తీవ్ర వాయుగుండం

Published on Wed, 11/27/2024 - 05:38

సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ): నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది ఉత్తర వాయవ్యంగా ప్రయాణించి బుధవారం తుపానుగా మారనుంది. తర్వాత కూడా అదే దిశలో ప్రయాణిస్తూ శ్రీలంక తీరానికి ఆనుకుని ప్రయాణించి.. ఈ నెల 29న నాటికి ఉత్తర తమిళనాడు వైపు రానుంది. దీని ప్రభావంతో మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు కురిశాయి. బుధ, గురువారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

ఈ నెల 29, 30 తేదీల్లో రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో అన్ని ప్రధాన ఓడరేవుల్లో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్న దృష్ట్యా డిసెంబర్‌ 1వ తేదీ వరకు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని వాతావరణ అధికారులు హెచ్చరించారు. తీవ్ర వాయుగుండం మంగళవారం రాత్రి ట్రింకోమలీకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో, నాగపటా్ననికి దక్షిణ–ఆగ్నేయంగా 710 కి.మీ., చెన్నైకి దక్షిణ–ఆగ్నేయంగా 800 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారిన తర్వాత దానికి ‘ఫెంగల్‌’ అని పేరు పెట్టనున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)