Breaking News

సర్వేచేసి పింఛన్లు తొలగిస్తాం

Published on Sun, 09/01/2024 - 05:04

టెక్కలి : ‘గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారు. ఇప్పుడు అధికారులతో సర్వే చేయించి అనర్హుల పింఛన్లు తొలగిస్తాం’.. అని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస గ్రామంలో శనివారం గ్రామ సచివాల­యం, రైతుసేవా కేంద్రం, వెల్‌నెస్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంతో పాటు సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. 

ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ ఇవ్వాలంటే తమ దగ్గర అక్షయపాత్ర లేదని.. చెట్లకు డబ్బులు పండడంలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నంగా ఉందని.. సొంత డబ్బులతో అన్న క్యాంటీన్లు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. 

తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా శాంతిభద్రతలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రావివలస ఫెర్రో అల్లాయిస్‌ పరిశ్రమను తెరిపించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. అనంతరం టెక్కలి జిల్లా ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.   

అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తాం :స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం: అర్హత లేని వారి పెన్షన్లు తొలగిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శనివారం ఆయన వృద్ధాప్య, వితంతు పింఛను సొమ్ము స్వయంగా అందజేశారు. సెప్టెంబర్‌ 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేపట్టామని తెలిపారు. అక్టోబర్‌2 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)