సొసైటీ గుమస్తా కుటుంబానికి న్యాయం చేస్తాం

Published on Mon, 08/19/2024 - 05:35

నరసరావుపేట: టీడీపీ నేతలు, బ్యాంకు సిబ్బంది వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పల్నాడు జిల్లా అన్నవరం పీఏసీఎస్‌ ఉద్యోగి ఓరుగుంటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తామని జీడీసీసీ బ్యాంకు అధికారులు హామీ ఇచ్చారు. రెండు, మూడు రోజుల్లో జీతం బకాయిలు చెల్లించడంతో పాటు అతని కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డికి తండ్రి ఉద్యోగం ఇస్తామన్నారు. అది కూడా పర్మినెంట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. వివరాలు.. పల్నాడు జిల్లా అన్నవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి గుమాస్తాగా పనిచేస్తున్నాడు. 

టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఉద్యోగం మానుకోవాలంటూ అతనిని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. టీడీపీ నేత, అన్నవరం సొసైటీ సీఈవో దొప్పలపూడి శ్రీనివాసరావు బ్యాంకు స్పెషల్‌ ఆఫీసర్‌ సురేంద్రబాబుతో కలిసి మూడు నెలలుగా జీతం కూడా నిలిపివేయించాడు. వారిద్దరి వేధింపులు తట్టుకోలేక శ్రీనివాసరెడ్డి శుక్రవారం గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. వైఎస్సార్‌సీపీ నేత, నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. 

నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. దీంతో శాంతి భద్రతల అదనపు ఎస్పీ సీహెచ్‌.లక్ష్మీపతి బ్యాంకు అధికారులతో మాట్లాడారు. చీఫ్‌ మేనేజర్‌ రమాదేవి ప్రభుత్వాస్పత్రికి వచ్చి శ్రీనివాసరెడ్డి భార్య రామసీతమ్మ, కుమారుడు లక్ష్మీప్రసన్నకుమార్‌రెడ్డి, కుమార్తె దేవికకు హామీలు ఇవ్వటంతో ఆందోళన విరమించారు. వెంటనే  హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి బ్యాంకు అధికారులకు సూచించారు. 

కాగా, తన చావుకు టీడీపీ నేత దొప్పలపూడి శ్రీనివాసరావు, స్పెషల్‌ ఆఫీసర్‌ సురేంద్రబాబు కారణమంటూ శ్రీనివాసరెడ్డి రాసిన సూసైడ్‌ నోట్‌ను కుమారుడు లక్ష్మీప్రసన్నరెడ్డి మీడియాకు చూపించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.  

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)