Breaking News

ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను సేకరిస్తాం

Published on Thu, 08/24/2023 - 04:18

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు అమూల్‌ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్‌ ఆర్గానిక్స్‌ బిజినెస్‌ హెడ్‌ నిమిత్‌ దోషి వెల్లడించారు. ఆర్గానిక్‌  సర్టిఫికేషన్‌ కలిగిన రైతుల నుంచి మా­ర్కెట్‌ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవ­సాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టు­బాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం  సచివాలయంలో అమూల్‌ ప్రతినిధి బృం­­దం భేటీ అయ్యింది. అమూల్‌ ఆర్గానిక్స్‌ ద్వా­రా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్‌ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు.

నిమిత్‌ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం  ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్‌ చేసి అమూల్‌ ఆర్గానిక్స్‌ పేరిట మార్కెట్‌లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్‌లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్‌ కో–ఆపరేటివ్‌ ఆర్గానిక్‌ లిమి­టెడ్‌లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు.

రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ చైర్మన్‌ టి.విజయకుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్‌ సీఈవో ఎండీ ఇంతియాజ్‌ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్‌ సర్టిఫికెట్‌ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్‌ఫెడ్‌ ఎండీ రాహుల్‌ పాండే, రైతు బజార్‌ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్‌సాల్కర్‌ పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)