Breaking News

పింఛన్ల పంపిణీకి ఆఫీసులోనే రాత్రి బస

Published on Mon, 07/01/2024 - 02:48

సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్‌: గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటివద్దే పింఛన్ల పంపిణీని చేపడుతున్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో పలు జిల్లాల్లో సచివాలయాల సిబ్బంది ఆదివారం రాత్రి తాము పనిచేసే సచివాలయంలోనే బస చేశారు. ఆదివారం సెలవు రోజైనప్పటికీ పింఛన్ల పంపిణీ కోసం సిబ్బంది అంతా సచివాలయానికి హాజరై ఏర్పాట్లుచేసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. సోమవారం ఉ.6 గంటల నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు మొదలుపెట్టాల్సిన నేపథ్యంలో సిబ్బంది అంతా ఆదివారం రాత్రి సచివాలయం పరిధిలోనే బసచేయాలని పలుచోట్ల జిల్లాల ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారని.. దీంతో అత్యధిక శాతం మంది సచివాలయాల్లోనే బసచేశారని ఉద్యోగ ప్రతినిధులు తెలిపారు.

 ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభించని వారిపై క్రమశిక్షణ చర్యలు చేపడతామని కూడా హెచ్చరించారని వారన్నారు. కాగా, ఒకటో తేదీనే దాదాపు వీలైనంత ఎక్కువమందికి పింఛన్ల పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో చాలా జిల్లాల్లో ఉన్నతాధికారులు సచివాలయాల వారీగా గంట గంటకు పంపిణీని పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. జిల్లా, రెవెన్యూ డివిజన్‌ స్థాయిలోనూ డీఎల్‌డీఓలు, డీపీఓలను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు. 

పంపిణీకి 30వేల మంది సిబ్బంది..
ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా పంపిణీ చేసే పింఛన్ల కార్యక్ర­మానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని రాష్ట్ర పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అన్నారు. తాడేపల్లి మండలం, పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా జూలై 1న ఉ.6 గంటలకు పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పింఛన్ల పంపిణీకి దాదాపు 30 వేల మంది ప్రభుత్వోద్యో­గులను నియమించామన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)