Breaking News

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు కలికిరి కిరికిరి

Published on Thu, 08/07/2025 - 05:47

సాక్షి, అమరావతి/చిత్తూరు రూరల్‌: శాస్త్రా­లు, సంప్రదాయాలు తరువాత.. ముందు నా మా­ట నెగ్గాల్సిందే అంటూ పట్టుబడుతు­న్నారు చి­త్తూ­రు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్‌. కాణిపాకం వినా­యకుడి బ్రహ్మోత్సవాల్లో చంద్రప్రభ వాహనసేవకు కొందరిని ఉభయదారులుగా చే­ర్చా­ల్సిందేనని మంకుపట్టు పడుతున్నారాయన. అయితే.. ఇలా చేర్చడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయానికి విరుద్ధమని ఉభయదారులు చెబుతున్నారు. దీనికి తాము అంగీకరించబోమని మీ­డియా సమావేశం ఏర్పాటుచేసి మరీ స్పష్టం చేశారు.  

పూతలపట్టు నియోజకవర్గంలోని కాణిపాకంలోని స్వ­యంభూ వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాలను ఏటా వినాయకచవితి పండుగ రోజు నుంచి 21 రోజులు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో స్వామిని రోజుకొక వాహనంపై ఊరేగిస్తారు. ఒక్కోసేవకు తరతరాలుగా కొన్ని గ్రామాలకు చెందిన కొన్ని కుటుంబాలవారే ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఈ నెల 27 నుంచి సెపె్టంబర్‌ 16 వరకు నిర్వహించనున్నారు. అయితే.. చంద్రప్రభ వాహనసేవలో మూడు గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుబడున్నారు. 

చంద్రప్రభ వాహనసేవకు కాణిపాకం, చిన్నకాంపల్లి, వడ్రంపల్లి, కారకంపల్లి, ఉత్తర బ్రాహ్మణపల్లి, పుణ్యసముద్రం, సంతపల్లి, మారేడుపల్లి, అగరంపల్లి, 45.కొత్తపల్లి, చిగరపల్లి, తిరువణంపల్లి, బొమ్మసముద్రం గ్రామాల వారు మాత్రమే తరతరాలుగా ఉభయదారులుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు పట్నం, పైపల్లి, సిద్ధంపల్లి గ్రామాలకు చెందిన కొందరిని ఉభయదారులుగా చేర్చాలని ఎమ్మెల్యే పట్టుపడుతున్నారు. తాను ఎమ్మెల్యేగా చెప్పినా కూడా వారిని ఉభయదారులుగా చేర్చుకోకపోవడం ఏంటని పలువురిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి.  

ఉభయదారుల వ్యవహారాల్లో జోక్యం కుదరదు 
కొత్తవారిని చేర్చాలన్న ఎమ్మెల్యే మురళీమోహన్‌ సూచన­కు తాము అంగీకరించకపోవడంతో ఆయన కక్షసాధింపు చర్యలకు దిగారని చంద్రప్రభ వాహనసేవ ఉభయదారుల్లో కొందరు బుధవారం చిత్తూరులో మీడి­యా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఆగమశా్రస్తాలు, త­రతరాల సంప్రదాయాలతో ముడిపడి ఉన్న బ్రహ్మోత్సవాల్లో ఇప్పుడు కొత్తగా ఉభయదారులుగా చేర్చుకో­వడం కుదరదని స్పష్టం చేశారు. 

‘అసలు ఉభయదా­రు­­ల వ్యవహారాల్లో వేలు పెట్టడానికి నువ్వెవరు? ఎ­మ్మె­­ల్యే అయినంత మాత్రాన నువ్వు చెప్పినవాళ్లందరి­నీ ఉభయదారులుగా చేర్చుకోవాలా? అలా సాధ్యం కా­­ద­ని చెప్పినందుకు మాలో ఒకరిని ఉదయం నుంచి సా­యంత్రం వరకు తిండీతిప్పలు లేకుండా పోలీస్‌ స్టే­ష­న్‌లో కూర్చోబెట్టించారు. దారిన పోయేవాళ్లందరి­నీ ఆ­లయ ఉభయదారులుగా అంగీకరించే ప్రసక్తేలేదు. మ­రోమా­రు ఎమ్మెల్యే మురళీమోహన్‌ ఈ వ్యవహారంలో తలదూ­రిస్తే ఆలయం ఎదుటే ధర్నా చేస్తాం..’ అని చెప్పారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)