Breaking News

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లండన్‌లో ఘన స్వాగతం

Published on Sun, 05/19/2024 - 05:58

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం లండన్‌ చేరుకొన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు లండన్‌కు బయలుదేరారు. శనివా­రం ఉదయం 5.15 గంటలకు లండన్‌లోని లూటన్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోవాల్సి ఉండింది. అయితే పొగ మంచు కారణంగా వాతావరణం అనుకూలించక పోవటంతో సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్డామ్‌ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. 

వాతావరణం చక్కబడిన అనంతరం ఆ విమానం తిరిగి లండన్‌ బయలుదేరింది. అందువల్ల నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ కుటుంబం లండన్‌ (లూకే) చేరుకుంది. అక్కడి లూటన్‌ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సీఎం జగన్‌ను చూడగానే జై జగన్‌ అంటూ అక్కడి వారు చేసిన నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఈ సందర్భంగా తనను కలిసిన వైఎస్సార్‌సీపీ యూకే సోషల్‌ మీడియా సభ్యులను, అభిమానులను సీఎం జగన్‌ పేరుపేరున పలకరించారు.  



మళ్లీ సీఎంగా జగనన్నే.. 
జూన్‌ 4వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్ని ప్రపంచంలో తెలుగు వారంతా చూడబోతున్నారని వైఎస్సార్‌సీపీ యూకే సోషల్‌ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతికుమార్‌ రెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మంచి చేసిన జగనన్న ప్రభుత్వాన్ని కొనసాగించుకునేందుకు పేదలు, మహిళలు, వృద్ధులు, సానుకూల ఓటింగ్‌తో తీర్పు ఇచ్చేశారని చెప్పారు. 

2019లో సాధించిన స్థానాల కంటే అధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని, వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చూసేందుకు ప్రపంచంలో తెలుగు సమాజం అంతా ఎదురు చూస్తోందన్నారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ యూకే కోర్‌ కమిటీ సభ్యులు చింతపంటి జనార్ధన్, గుర్రం చలపతి రావు, కిరణ్‌ ఇస్లావత్, వేలూరు సాయితేజ, పి.అశోక్‌ కుమార్, ముడియాల కుమార్‌ రెడ్డి, దేవరపల్లి చాళుక్య, కొరముట్ల పునీత్, మద్దాలి కుమారస్వామి తదితరులు ఉన్నారు.    

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)